హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ 9 నగరాల్లో కూడా.. స్పూత్నిక్ వీ అవెలబుల్...

|
Google Oneindia TeluguNews

భారత్‌లో అందుబాటులోకి వచ్చిన మూడో కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ప్రకటించింది. భారత్‌లో ఈ టీకా ఉత్పత్తి, పంపిణీకి రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ముందుగానే వ్యాక్సిన్‌ నిల్వ వసతులను పరీక్షించడంలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న హైదరాబాద్‌ సహా మరో తొమ్మిది నగరాల్లోనూ ఈ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ఆ నగరాల జాబితాలో విశాఖపట్నం, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, బడ్డీ, చెన్నై, మిర్యాలగూడ, కొల్హాపూర్‌ ఉన్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని నగరాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీంతో ఆయా నగరాల్లో టీకా నిల్వ, పంపిణీ వసతులు, కొవిన్‌తో అనుసంధానం సహా ఇతరత్రా అంశాలపై అవగాహన వస్తుందన్నారు.

good news, sputnik vaccine avilable 6 cities

ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. సో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా గ్రీన్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

English summary
sputnik vaccine avilable 6 cities as soon as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X