హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్షల వీడియోలు తొలగిస్తున్న యూట్యూబ్.. అలాంటి వాటికి ఇక బ్రేక్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : యూట్యూబ్ ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్నాయి. లక్షల కొద్దీ వీడియోలు ప్రతి నిత్యం అప్‌లోడ్ అవుతున్న తరుణంలో యాజమాన్యం ఎప్పటికప్పుడూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ చేస్తున్న యూట్యూబ్ నిర్వాహకులు పనికిమాలిన వీడియోలను డిలేట్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లను సైతం తొలగిస్తున్నారు.

ప్రతి రోజు లక్షల కొద్దీ వీడియోలు అప్‌లోడ్

ప్రతి రోజు లక్షల కొద్దీ వీడియోలు అప్‌లోడ్

గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద దూసుకెళుతోంది. ప్రతి నిత్యం లక్షల కొద్దీ వీడియోలు అప్‌లోడ్ చేసే మహత్తర వేదికగా యూట్యూబ్ క్రెడిట్ అంతా ఇంతా కాదు. న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ.. ఇలా వివిధ రంగాల్లో ఔత్సాహికులకు యూట్యూబ్ మంచి వేదికలా నిలుస్తోంది. అకౌంట్ క్రియేట్ చేయడానికి రూపాయి ఖర్చు లేకుండా పోవడంతో చాలామంది క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్లు ఈ దిశగా అడుగులేస్తున్నారు. సృజనాత్మకతకు పెద్ద పీట వేస్తూ మంచి మంచి వీడియోలు రూపొందిస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదించే యూట్యూబర్స్ కూడా ఉన్నారు.

మంచి కన్నా చెడు ఎక్కువగా..!

మంచి కన్నా చెడు ఎక్కువగా..!

అయితే అదంతా ఒక పార్శ్వం. మరో వైపు చూస్తే యూట్యూబ్‌లో మంచి కన్నా చెడు ఎక్కువ కనిపిస్తోందనే వాదనలు లేకపోలేదు. ఆ క్రమంలో సెన్సార్ కటింగ్ లాగా యూట్యూబ్ నిర్వాహకులే చెత్తను తొలగించే పనిలో పడ్డారు. అలా ఈ ఏడాదిలో జూన్ నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఇప్పటికే దాదాపు లక్ష వరకు వీడియోలను తొలగించినట్లు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 17 వేలకు పైగా యూట్యూబ్ ఛానల్స్‌లో నిబంధనలకు విరుద్దంగా ఉన్న లక్ష వీడియోలను డిలేట్ చేసినట్లు తెలిపారు. వాటిలో చాలా మటుకు ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న వీడియోలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

ఏప్రిల్ - జూన్‌లో 90 లక్షల వీడియోలు డిలేట్

ఏప్రిల్ - జూన్‌లో 90 లక్షల వీడియోలు డిలేట్


ఏప్రిల్ - జూన్ క్వార్టర్లీకి సంబంధించి మొత్తం 90 లక్షలకు పైగా వీడియోలను డిలేట్ చేయడమే గాకుండా.. 40 లక్షలకు పైగా యూట్యూబ్ అకౌంట్లను తొలగించామని నిర్వాహకులు ప్రకటించారు. వాటిలో చాలా మటుకు వీడియోలు వీక్షకులను తప్పు దోవ పట్టించే విధంగా ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు స్పామ్ కేటగిరీలో కూడా చాలా వరకు వీడియోలు ఉన్నట్లు వివరించారు.

అందుకే ముందు జాగ్రత్తగా అలాంటి వీడియోల్లో కొన్నింటిని ఒక్కరు కూడా వీక్షించకముందే డిలేట్ చేసినట్లు ప్రకటించింది యూట్యూబ్ సంస్థ గూగుల్. భవిష్యత్తుల్లో కూడా వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ వీడియోలకు పెద్ద పీట వేస్తూ చెత్త చెదారం లాంటి వీడియోలను ఎప్పటికప్పుడు డిలేట్ చేస్తామని ప్రకటించింది. ఇకపై నిబంధనలను కఠినతరం చేస్తూ వీక్షకులకు ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా చూస్తామని తెలిపింది. ఆయా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు అప్‌లోడ్ చేసే వీడియోలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దాదాపు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించింది గూగుల్.

యూట్యూబ్ ఛానళ్లపై కొరడా.. రూల్స్ బ్రేక్ చేస్తే అంతే..!

యూట్యూబ్ ఛానళ్లపై కొరడా.. రూల్స్ బ్రేక్ చేస్తే అంతే..!


చెత్త చెదారం నింపడమే గాకుండా.. పైన థంబ్ నెయిల్ ఒకటి, లోపల కంటెంట్ మరొకటి ఉంటున్న వీడియోలపై యూట్యూబ్ సీరియస్‌గా ఉంటోంది. అంతేగాకుండా అత్యాచారం కేసుల్లో మైనర్లను చూపించడం లాంటి విషయాల్లో కూడా ఆచితూచి స్పందిస్తోంది. నేర ప్రవృత్తి కలిగి ఉన్న వీడియోల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వాస్తవానికి మైనర్లను, అత్యాచార బాధితులను నేరుగా చూపించకుండా ముఖానికి మాస్క్ వేసేలా బ్లర్ చేస్తూ చూపించడమనేది ఎలక్ట్రానిక్ మీడియా ఫాలో అవుతోంది. కానీ యూట్యూబ్ ఛానళ్ల విషయంలో మాత్రం అది కంట్రోల్ లేకుండా అవుతోంది. అందుకే ఇలాంటి వీడియోలను స్క్రూటినీ చేస్తూ వేలాది వీడియోలను తొలగించడమే గాకుండా ఆయా యూట్యూబ్ ఛానళ్లపై ఉక్కుపాదం మోపుతోంది గూగుల్.

English summary
Google's YouTube social media is not the only platform that uploads millions of videos every day. News, Entertainment, Comedy .. YouTube is a good platform for entrepreneurs in various fields. YouTube sanctions are being tightened to this end. They deleting waste videos and cuts the youtube channels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X