హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోరటి వెంకన్న సహా ఆ ఇద్దరు: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పేర్లు ఖరారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం మంత్రి వర్గం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నేత బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వైజర్, ఆర్యవైశ్య సంఘం నేత బొగ్గారపు దయానంద్ పేర్లను కేసీఆర్ కేబినెట్ ఖరారు చేసింది.
ఈ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.

goreti venkanna and basavaraju saraiah and one more may get mlc seats from governor quota.

బస్సరాజు సారయ్య గతంలో కాంగ్రెస్ నుంచి వరంగల్ తూర్పు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. త్వరలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో ఆ నగరానికి చెందిన బీసీ నేత బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం గమనార్హం.

ఇక వైశ్య సామాజిక వర్గానికి చెందిన దయానంద్, తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించిన ప్రజా గాయకుడు గోరటి వెంకన్నకు ఈసారి ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించడం కూడా టీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జీహెచ్ఎం ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉండటంతో కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. దుబ్బాక ఫలితాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల అలసత్వం ప్రదర్శించకూడదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలావుండగా, ఎమ్మెల్సీగా ఎంపికైన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని శాలువాతో సత్కరించారు.

English summary
goreti venkanna and basavaraju saraiah and one more may get mlc seats from governor quota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X