• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పాకిస్తాన్ కోడలికి ఆ పదవి ఎందుకు : రాజాసింగ్.. నా దేశభక్తిని శంకించడానికి మీరెవరు : సానియా

|

హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు తలనొప్పులు తప్పడం లేదు. ఉగ్రదాడిని ఆలస్యంగా ఖండించినందుకు సోషల్ మీడియాలో ఆమెను చెడుగుడు ఆడుతున్నారు. జవాన్లు చనిపోయిన సందర్భం ఓ వైపుంటే.. తన ఫోటో షూట్ కు సంబంధించి పోస్టులు పెట్టడం మరింత దుమారం రేపింది. నెటిజన్ల ఆగ్రహంతో సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తూనే ట్రోలింగ్ చేసేవారిపై మండిపడింది. అదలావుంటే పాకిస్తాన్ కోడలుకు ఆ పదవి ఎందుకంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.

పాకిస్తాన్ కోడలుకు ఆ పదవెందుకు?

పాకిస్తాన్ కోడలుకు ఆ పదవెందుకు?

టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాపై నిప్పులు చెరిగారు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. పెళ్లి తర్వాత పాకిస్తాన్ కోడలుగా మారిన సానియాను.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పించాలని సీఎం కేసీఆర్ ను కోరారు. భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి సహాయ సహాకారాలు అందించవద్దని కోరారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. పాక్ దుశ్చర్యలను ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారు. కేసీఆర్ కూడా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ తో సంబంధమున్న వ్యక్తులను ఎంకరేజ్ చేయొద్దని.. సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా తప్పించాలని సూచించారు. తెలంగాణలో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారని.. వారిలో ఒకరిని సెలెక్ట్ చేయాలని కోరారు. ఎట్టిపరిస్థితుల్లో సానియాను ఆ పదవి నుంచి తప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 దేశభక్తి కోసం గొంతు చించుకోవాలా : సానియా

దేశభక్తి కోసం గొంతు చించుకోవాలా : సానియా

టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా మరోసారి వివాదంలో చిక్కుకుంది. పుల్వామా ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఆమె ఆలస్యంగా స్పందించింది. దీంతో నెటిజన్లు సానియాను వ్యతిరేకిస్తూ ట్రోల్స్ చేశారు. అదే సమయంలో తన ఫోటో షూట్ కు సంబంధించిన పోస్టులు పెట్టడంతో మరింత భగ్గుమన్నారు నెటిజన్లు. చివరకు మెట్టు దిగొచ్చి ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్ట్ పెట్టినా ఆమెను వదల్లేదు. దీంతో అసహనానికి గురైన సానియా.. సోషల్ మీడియా వేదికగా దేశభక్తి గురించి వివరణ ఇస్తూనే ట్రోలర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గొంతు చించుకుని అరిస్తేనే దేశభక్తి ఉన్నట్లా అంటూ మండిపడింది.

సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే సెలబ్రిటీలకు దేశభక్తి ఉందని నమ్మేవాళ్ల కోసమే ఈ పోస్ట్ పెడుతున్నానంటూ పెద్ద వ్యాసమే రాసింది సానియా. సెలబ్రిటీలం కాబట్టి పనిగట్టుకుని మాపై విద్వేషం పెంచాలనేది చాలామంది ప్రయత్నిస్తారు. అందుకే అలాంటివారు ఏ సందర్భాన్ని వదులుకోరు. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకమంటూ మాకు గొంతు చించుకుని అరవాల్సిన అవసరం మాత్రం లేదు. ఏ ఒక్కరూ కూడ ఉగ్రవాదాన్ని సమర్థించరు. నా దేశం కోసం ఆడే నేను అందుకోసం చెమట చిందిస్తూ సేవ చేస్తున్నాను. ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబానికి అండగా ఉంటాను. ఫిబ్రవరి 14 మన దేశానికి బ్లాక్ డే లాంటిది. అలాంటి మరో రోజు చూడొద్దని అనుకుంటున్నా. ఇంట్లో కూర్చుని ఏ సెలబ్రిటీలు ఏమేమే పోస్టులు పెట్టారోనని చూడకుండా.. దేశానికి పనికొచ్చే పనిచేయండంటూ ట్రోలర్స్ పై విరుచుకుపడింది.

ఓ వైపు జవాన్లు చనిపోతే.. నీకు ఫోటో షూట్ కావాలా?

ఓ వైపు జవాన్లు చనిపోతే.. నీకు ఫోటో షూట్ కావాలా?

ఉగ్రదాడి జరిగి 40 మందికి పైగా జవాన్లు చనిపోతే.. సోషల్ మీడియాలో ఫోటో షూట్ పోస్టులు పెడతావా అనేది నెటిజన్ల కోపం. అది సరైన సందర్భమేనా అంటూ ప్రశ్నించారు. ఉగ్రదాడిని ఖండించాల్సింది పోయి నీ ఫోటోలు పెట్టడమేంటని వ్యతిరేక ట్రోల్స్ నడిపారు. భారత మహిళగా నిన్ను గౌరవిస్తాం.. అదే సమయంలో పాకిస్తానీ భార్యగా నీకు గౌరవం ఇవ్వబోము అని కొందరంటే.. నీవు అసలైన పాకిస్తానీవి అంటూ మరికొందరు మండిపడ్డారు. నీ పేరు కోసం భారతీయ జెండాను వాడుకున్నావు, ఇప్పడు భారత్ నిన్ను బాయ్ కాట్ చేస్తోందని ఇంకొందరు ఆగ్రహించారు. అలా సోషల్ మీడియా వేదికగా సానియాను వ్యతిరేకిస్తూ వీపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

English summary
Netizens fired on Tennis player Sania Mirza for late presence of Pulwama's aggression. While jawans were dead, the posting of sania mirza photo shoot provoked more and more. The Issue in the social media platform has been exploited by the trollingers. Raja Singh, MLA of Goshamahal, questioned why that was the telangana brand ambassador for Pakistan's daughter in law sania.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X