హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదే ఫైనల్.. మార్పు కనిపించకపోతే ఊరుకునేది లేదు : కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ,అభివృద్ది పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సలహాలు,సూచనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే అధికారులకు ప్రాధాన్యంగా ఉండాలి తప్ప.. వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండవద్దన్నారు. మంగళవార ప్రగతి భవన్‌లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ వారికి దిశా నిర్దేశం చేశారు.

అదే ఫైనల్..

అదే ఫైనల్..

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుందని.. వాటిని అమలుచేయాల్సిన బాధ్యత అధికారులదేనని కేసీఆర్ అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను అధికార యంత్రాంగం తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, పథకాలు,ఇతరత్రా కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

కేసీఆర్ హెచ్చరిక...

కేసీఆర్ హెచ్చరిక...

పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో మార్పు రాకపోతే ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి తనిఖీలు చేస్తానని కలెక్టర్లతో సీఎం అన్నారు. కాబట్టి పని విషయంలో,ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో రాజీ పడవద్దని,నిర్లక్ష్యం వద్దని చెప్పారు. ఒకవేళ ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లదే అని చెప్పారు. త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

Recommended Video

Good Morning India: 3 Minutes 10 Headlines : YS Jagan To Meet Modi, Amit Shah
 అక్షరాస్యత ఫోకస్ పెట్టామన్న కేసీఆర్..

అక్షరాస్యత ఫోకస్ పెట్టామన్న కేసీఆర్..


ఇక అక్షరాస్యతలో రాష్ట్రం వెనుకబడి ఉన్న నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు.

కలెక్టర్ల వ్యవస్థ బలోపేతానికి చర్యలు..

కలెక్టర్ల వ్యవస్థ బలోపేతానికి చర్యలు..

రాష్ట్రంలో రూ.40వేల కోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని కేసీఆర్ తెలిపారు. కలెక్టర్ల వ్యవస్థ ప్రభుత్వం బలోపేతానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోబోతుందన్నారు. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం ఉంచిందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.అధికార యంత్రాంగం అందరిని కలుపుకుపోయేలా.. ఒక టీమ్‌ లాగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు.

English summary
KCR said that after studying the actual situation in the field, the government will take laws. It is clear that the decisions taken by the governments elected by the people are final. Authorities must implement government decisions. Collectors should pay special attention to the implementation of laws, schemes and other programs introduced by the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X