హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిలియన్ మార్చ్‌కు ముందే పరిష్కారం చేయాలి ... లేదంటే పతనమే : లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలు నిర్వహించక ముందే ప్రభుత్వం పరిష్కారం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వ పతనం ఖాయమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని అన్నారు.

TSRTC STRIKE:24 గంటల దీక్ష, మిలియన్ మార్చ్, ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ ఇదే..TSRTC STRIKE:24 గంటల దీక్ష, మిలియన్ మార్చ్, ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ ఇదే..

ఇక సమ్మె సమాచారాన్ని పార్టీపరంగా అటు ప్రభుత్వ పరంగా గవర్నర్‌ ద్వారా కేంద్రానికి సమాచారం అందిస్తున్నామని చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ఆస్తులను అమ్ముకునేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఇక బీజేపీ అధికారంలో వచ్చిన అనంతరం ప్రభుత్వం చేపట్టిన లీజు వ్యవహరాలన్ని బయటకు తీస్తామని ఆయన హెచ్చరించారు.

Government Should resolve the RTC strike before the Million March

గత ఇరవైఏడు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే... అయితే బీజేపీ తెచ్చిన నూతన మోటారు వాహనం చట్టంతోనే సీఎం కేసీఆర్ అడుగులు ముందుకు వెస్తున్నాడు. కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఆయుధంగా చేసుకుని ఆర్టీసీలో 50 శాతం బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేందుకు సన్నద్దమయ్యారు. ఇప్పటికే అధికారులు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. అధికారుల ప్రతిపాదలనకు అమోదముద్ర వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని నవంబర్ 2న నిర్వహించనుంది. ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల అనుమతులే ప్రధాన ఎజెండాగా సమావేశం కొనసాగనుంది. దీంతో ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రతిపక్షాలు చేపడుతున్న ఆందోళనలకు ప్రభుత్వం మాత్రం వెనకడుగుకు వేయకుండా ప్రైవేటీకరణ వైపు పరుగులు తీస్తోంది.

English summary
government resolve the RTC strike before conducting the Million March and sagara haram Programs, BJP state president Laxman has demanded
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X