హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు మరో షాక్.. అప్పుడు హైకోర్టు.. ఇప్పుడు గవర్నర్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మరో షాక్ తగిలింది. ఇప్పటివరకు పలు అంశాలకు సంబంధించి హైకోర్టులో మొట్టికాయలు పడితే ఇప్పుడేమో ఏకంగా గవర్నర్ ఝలక్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఇది టీఆర్ఎస్ పార్టీకి పెద్దదెబ్బ అనే వాదనలు లేకపోలేదు.

కొత్త పురపాలక చట్టం తీసుకొస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ బిల్లుకు సంబంధించిన కొన్ని అంశాలపై గవర్నర్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో నూతన పురపాలక చట్టానికి గవర్నర్ ఆమోద ముద్ర లభించలేదు. ఎన్నికల నిర్వహణ అంశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. చివరకు గవర్నర్ సూచించిన కొన్ని అంశాలతో ఆర్డినెన్స్ జారీ చేస్తూ సైలెంట్ అయిపోయింది.

governor narasimhan shocks to telangana cm kcr

కేటీఆర్ నయా లుక్.. ఫ్యాన్స్ సందడి.. తారకరాముడు హ్యాపీ..!కేటీఆర్ నయా లుక్.. ఫ్యాన్స్ సందడి.. తారకరాముడు హ్యాపీ..!

నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చేలా రెండు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఆ క్రమంలో అసెంబ్లీతో పాటు శాసనమండలిలోనూ బిల్లు ఆమోదం పొందింది. అలా గవర్నర్ ఆమోదం పొంది కొత్తం చట్టం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే కొత్త చట్టంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి అధికారాలు పొందుపరచడంతో గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు నయా చట్టానికి ఆయన కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన సూచించిన విధంగానే మరికొన్ని అంశాలు జత చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. మొత్తానికి నూతన పురపాలక చట్టం తీసుకురావాలని ఎన్నో కలలుగన్న ప్రభుత్వానికి చివరకు నిరాశే మిగిలింది.

English summary
Governor Narasimhan Shocks to Telangana CM KCR on New Municipal Act. He objected some points in new act, then he suggested new points. At last KCR Government released Ordinance in the place of New Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X