హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటికో పోలీసు ఉండరు, వివాదాస్పదమైన మంత్రి తలసాని వ్యాఖ్యలు, నెటిజన్ల సెటైర్లు

|
Google Oneindia TeluguNews

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యతో సమాజం అంతా ఉడికిపోతుంటే తెలంగాణ మంత్రులు బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న సమయంలో నోరుజారుతున్నారు. చెల్లికి కాకుండా పోలీసులకు ఫోన్ చేస్తే బాగుండేదని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇదే వాదనతో మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఏకీభవించారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో అడుగు ముందుకేసి మాట్లాడారు. ఇంటింటికీ ఓ పోలీసు పెట్టలేం కదా అని నోరుజారారు. మంత్రి కామెంట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆ నలుగురికి ఉరే సరి, కోర్టులో వారి తరఫున వాదనలు వినిపించొద్దు, లాయర్లకు ప్రియాంక తండ్రి రిక్వెస్ట్ఆ నలుగురికి ఉరే సరి, కోర్టులో వారి తరఫున వాదనలు వినిపించొద్దు, లాయర్లకు ప్రియాంక తండ్రి రిక్వెస్ట్

పోలీసులకు ప్రశంసలు

పోలీసులకు ప్రశంసలు

దేశవ్యాప్తంగా హైదరాబాద్ పోలీసులకు ఓ ప్రాధాన్యం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. విశ్వనగరి భాగ్యనగరంలో భద్రత గురించి ప్రశంసలు కూడా అందుకున్నారని చెప్పారు. అంతేకాదు ఎలాంటి ఘటన జరిగిన వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని చెప్పారు. దేశవ్యాప్తంగా నేరాలు పెరుగుతుండటం, భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సీసీ కెమెరా నీడన పలు కేసులను చేధించామని కూడా పేర్కొన్నారు.

ఇంటికో పోలీసు ఉండరు

ఇంటికో పోలీసు ఉండరు

హైదరాబాద్ మెట్రో పాలిటిన్ సిటీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ సెలవిచ్చారు. కోటికి పైగా జనాభా ఉందని వివరించారు. ఇంతమంది జనం కోసం భద్రత కల్పించడం కత్తిమీద సాము అని పేర్కొన్నారు. వ్యవస్థ భద్రత కల్పిస్తోంది కానీ.. ఇంటింటికీ ఓ పోలీసు పెట్టదని తన నిర్లక్ష్యంగా మాట్లాడారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందని చెప్పారు. మంత్రి కామెంట్లపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మంత్రి తీరు సరిగాలేదని దుయ్యబట్టారు.

విమర్శలు

విమర్శలు

బాధ్యతాయుతమైన పదవీలో ఉన్న మంత్రి కేర్‌లేస్‌గా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి తలసాని తీరును నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. భద్రత కల్పించాల్సిన మంత్రి ఇలా మాట్లాడటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. సరికాదని.. తన కామెంట్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పక్కా ప్లాన్

పక్కా ప్లాన్

ఎప్పటిలాగే బుధవారం కూడా ప్రియాంక రెడ్డి టోల్ ప్లాజా వద్దకొచ్చారు. అక్కడ బండి పార్క్ చేసి క్యాబ్‌లో వెళ్లారు. కానీ అప్పటికే అక్కడ కీచకులు తిష్ట వేశారు. మహ్మద్ పాషా అండ్ కో.. ప్రియాంక రావడం వెళ్లడం గమనించారు. బండి పెట్టడం వల్ల.. ఆమె తిరిగొస్తుందని అనుకొన్నారు. అటు, ఇటు చూసి బండి పంక్చర్ చేశాడు. మాదాపూర్‌లో ట్రీట్‌మెంట్ చేయించుకొని తిరిగొచ్చిన ప్రియాంక.. వెనక టైర్ పంక్చరవడం చూసి షాక్ తిన్నారు. సాయం చేస్తామని.. లైంగికదాడికి తెగబడ్డారు. ఊపిరాడకుండా చేసి హతమార్చారు.

English summary
govt did’nt gave for home one police.. minister talasani srinivas yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X