హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో 20 ప్రైవేట్ ఆస్పత్రులకు పర్మిషన్.. 224కి చేరిన దవాఖానల సంఖ్య.. కారణమిదేనా..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్నటి వరకు లక్ష 62 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే చికిత్స అవసరం ఉన్న వారి సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా వైరస్ కోసం చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రోగులకు ట్రీట్‌మెంట్ మరింత చేరవవుతోందని తెలిపింది.

Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం ! Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !

204 ఆస్పత్రులు..

204 ఆస్పత్రులు..

వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు 204లో కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే వైరస్ కేసులు పెరగడం.. ఇప్పటికే వచ్చినవారు కొందరికీ ఆస్పత్రిలో చికిత్స అవసరం అవుతోంది. దీంతో మరో 20 ప్రైవేట్ ఆస్పత్రులకు కరోనా వైరస్ చికిత్స అందించేందుకు వైద్యారోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఆస్పత్రుల సంఖ్య 224కి చేరింది. అంతేకాదు ఆస్పత్రుల్లో బెడ్ల సామర్థ్యం కూడా పెరిగింది. 10 వేల 733 పడకల నుంచి 11 వేల 288కి పెరిగింది.

బెడ్లు లేకపోవడంతో..

బెడ్లు లేకపోవడంతో..

కరోనా వైరస్ వచ్చిన వారు ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్నారు. అయితే అక్కడ బెడ్లు లేకపోవడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థికంగా ఉన్నవారు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నారు. కానీ మధ్యతరగతి వారు మాత్రం భయపడిపోతున్నారు. పొరుగురాష్ట్రం ఏపీలో కరోనా వైరస్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చారు. కానీ తెలంగాణలో మాత్రం లేదు. దీనిపై విపక్షాలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. అన్నీ వైపుల నుంచి డిమాండ్ రావడంతో ప్రభుత్వం కూడా దృష్టిసారించింది. కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్య శ్రీలో చేరుస్తామని సంకేతాలు ఇచ్చింది. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

రెండు కారణాలు..

రెండు కారణాలు..

అయితే ప్రైవేట్ ఆస్పత్రులకు పర్మిషన్ ఇవ్వడంలో కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య శ్రీలో చేర్చేముందే ప్రైవేట్ యజమాన్యాలు జాగ్రత్త పడి దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా పేదలకు కార్పొరేట్ వైద్యం అందజేయడానికి ప్రైవేటుకు అనుమతి ఇచ్చిందని తెలిసింది. ఎలాగూ కరోనాను ఆరోగ్య శ్రీలో చేరుస్తామని.. తద్వారా వారంతా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటారని తెలుస్తోంది.

English summary
telangana government permitted to another 20 private hospitals in the state for coronavirus treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X