హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

No breathe..?:ఆస్పత్రులు ఫుల్.. పడకలు నిల్, ప్రైవేట్‌కు వెళితే జేబు గుల్ల..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. లక్షా 57 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉండగా.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జూలై 27న మొదటిసారి బులెటిన్‌లో వెంటిలేటర్ల సంఖ్య, వాటిపై చికిత్స పొందుతున్నవారి వివరాలను పేర్కొన్నది. అప్పటి నుంచి వెంటిలేటర్లపై ఎంత మంది చికిత్స తీసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎంత మంది ఉన్నారు..? జిల్లాల్లోని ఆస్పత్రుల సంఖ్యపై వివరాలు అందజేస్తున్నారు.

అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో నంబర్ వన్.. కరోనా పాజిటివ్‌లో ఇండియా..?.. అధ్యయనం..అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో నంబర్ వన్.. కరోనా పాజిటివ్‌లో ఇండియా..?.. అధ్యయనం..

అప్పుడు 744 మంది..

అప్పుడు 744 మంది..

జూలై 27వ తేదీన ప్రైవేటు ఆస్పత్రుల్లో 472 మంది, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 272 మంది వెంటిలేటర్‌ చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 744 మంది ట్రీట్ మెంట్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 1579కి పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న ఐసీయూ బెడ్లు 3,304 ఉండగా.. వాటిలో ఇప్పటికే 1579 నిండిపోయాయి. ఆగస్టు 1 నాటికి 42 శాతంగా ఉన్న వెంటిలేటర్‌ పడకల ఆక్యుపెన్సీ.. ఇప్పుడు 47 శాతానికి పెరిగింది. ఇందుకు జిల్లాల్లో కరోనా కేసుల పెరుగుతుండటమే కారణమని వైద్యులు చెబుతున్నారు.

జిల్లాల్లో కేసులు అధికంగా..

జిల్లాల్లో కేసులు అధికంగా..

తొలుత హైదరాబాద్‌లో కేసుల అధికంగా ఉండగా.. ఇప్పుడు జిల్లాల్లోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌పై గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆలస్యంగా ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో వారికి వెంటిలేటర్‌‌పై చికిత్స అవసరం అవుతోంది. ఏడు జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న ఐసీయూ బెడ్లు నిండిపోయాయి. నల్గొండ జిల్లాలో జీజీహెచ్‌ ప్రభుత్వ ఆస్పత్రి, మిర్యాలగూడలో ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్‌ బెడ్లు ఫుల్ అయ్యాయి.

 అవసరమైతే ప్రైవేటుకు వెళ్లాల్సిందే..?

అవసరమైతే ప్రైవేటుకు వెళ్లాల్సిందే..?

మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో ఐదు పడకలు మాత్రమే మిగిలాయి. సూర్యాపేటలో 25, సిరిసిల్ల 10, నాగర్‌ కర్నూల్‌ 8, మహబూబాబాద్‌ 12, గద్వాల 5, భద్రాద్రి కొత్తగూడెం 4 జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ బెడ్లు నిండిపోయాయి. ఆయా చోట్ల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిలో ఎవరికైనా వెంటిలేటర్‌ అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలవారీగా బెడ్ల వివరాలు

జిల్లాలవారీగా బెడ్ల వివరాలు

పాలమూరులో 35 బెడ్లకు 21 నిండిపోగా.. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి 500 పడకలకు 445 ఫుల్‌ అయ్యాయి. ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో 120 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉండగా, అవన్నీ నిండిపోయాయి. పాలమూరులో 65, నల్గొండ 35, నిజామాబాద్‌ 205, సిరిసిల్ల 22, సూర్యాపేట 40లో ఆక్సిజన్‌ బెడ్లు నిండిపోయాయి. ప్రభుత్వ దవాఖానాల్లో 1224 వెంటిలెటర్స్‌ అందుబాటులో ఉండగా అందులో 670 మంది రోగులు ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 2078 వెంటిలెటర్స్‌ ఉంటే అందులో 909 మంది చికిత్స పొందుతున్నారు.

పెరిగిన వెంటిలేటర్ల వినియోగం

పెరిగిన వెంటిలేటర్ల వినియోగం

ఈ నెల 1వ తేదీ నాటికి ప్రైవేటు ఆస్పత్రుల్లో 1980 వెంటిలెటర్స్‌ బెడ్స్‌ ఉండగా.. 833 మంది చికిత్స పొందుతున్నారు. సర్కార్ దవాఖానల్లో 1224 బెడ్స్‌కుగాను 668 మంది చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 1 నాటికి సర్కార్ దవాఖానల్లో కేవలం 272 మంది మాత్రమే చికిత్స తీసుకుంటుండగా.. మిగిలిన బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 1218 వెంటిలెటర్స్‌ ఉంటే 765 మందికి ట్రీట్‌మెంట్ జరుగుతుంది.

English summary
No breathe..?..govt, private hospitals ventilators are full in telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X