ముగిసిన గ్రేటర్ పోలింగ్ .. ఓటింగ్ ను లైట్ తీసుకున్న గ్రేటర్ ఓటర్లు .. కారు గుర్తు హైలెట్ చేశారని బీజేపీ ఫిర్యాదు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది . ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చాలా కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోకపోవడంతో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి . అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ పార్టీలు ఎవరూ ఊహించని విధంగా ఈసారి పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. సాయంత్రం 5గంటల వరకు 35.80 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే కూడా అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది.
పోలింగ్ శాతం తగ్గించే కుట్ర చేసిన టీఆర్ఎస్ .. కేసీఆర్.. కౌంట్ డౌన్ స్టార్ట్ అన్న బండి సంజయ్

ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ లో మాత్రమే రీ పోలింగ్
ఇక ఐటీ ఉద్యోగులు ఎవరు పోలింగ్ వైపు ఆసక్తి చూపించినట్లు గా కనిపించలేదు. చిన్న చిన్న సంఘటనలు మినహాయించి, పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఒక ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో మాత్రమే రీపోలింగ్ జరగనున్నట్లు గా తెలుస్తుంది . డిసెంబర్ 3వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 4న ఏ పార్టీ భవిష్యత్ ఏంటో తేలిపోనుంది.

పోలింగ్ ను లైట్ తీసుకున్న గ్రేటర్ వాసులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మొత్తంగా చూస్తే ఈరోజు ఉదయం నుండి అనేక గందరగోళాల మధ్య కొనసాగింది. ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకుంటే, ఓటు వేయకుండా గ్రేటర్ వాసులు చాలా లైట్ గా తీసుకున్నట్లు గా కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం సగం మంది ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోని పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే జిహెచ్ఎంసి ఎన్నికలలో అధికార పార్టీ, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడుతుంది బీజేపీ .

పోలీస్ అధికారులు , ఎన్నికల సంఘంపై బీజేపీ నేతల ఆరోపణలు
రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని బిజెపి నేతలు ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తోంది విషయం తెలిసిందే. చాలాచోట్ల టిఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు కూడా చేశారు బిజెపి నేతలు. పలుచోట్ల టిఆర్ఎస్ పార్టీ, నేతలకు బిజెపి నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
ఇదే సమయంలో కొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్ మీద టిఆర్ఎస్ కు సంబంధించిన కారు గుర్తు హైలైట్ చేస్తూ దాని చుట్టూ ఒక గడి కొట్టినట్లుగా ముద్రించారు అని చెబుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బిజెపి. ఎన్నికలను రద్దుచేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తుంది.

కారు గుర్తు హైలెట్ చేస్తూ బ్యాలెట్ ల ముద్రణ .. రీపోలింగ్ పెట్టాలని బీజేపీ ఫిర్యాదు
ఏఎస్ రావు నగర్ లోని రెండవ వార్డులో, అలాగే గడ్డి అన్నారం లోని 23వ వార్డులో అలా కారు గుర్తు హైలెట్ అయినట్లుగా ముద్రించడం పోటీలో ఉన్న ఇతర పార్టీలకు నష్టం చేస్తుందని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బిజెపి. పార్టీ గుర్తు హైలెట్ చేయడం వల్ల ఓటర్లు ప్రలోభపెట్టి ఆ గుర్తుకే ఓటు వేసే అవకాశం ఉందని బిజెపి నాయకుల వాదన. ఎన్నికలను రద్దుచేసి ఆ రెండు స్థానాల్లో తిరిగి రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న బిజెపి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తమ ఫిర్యాదును, అలాగే రీ పోలింగ్ కోసం విజ్ఞప్తిని అందజేసింది.
ఈ విషయంలో ఈసీ ఏ నిర్ణయం తీసుకోలేదు.