హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ రిజల్ట్స్: జీహెచ్ఎంసీ ఫలితాలపై గ్రేటర్ వరంగల్ వాసుల ఉత్కంఠ..రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై గ్రేటర్ వరంగల్ వాసులలో ఉత్కంఠ నెలకొంది. జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కి అనుకూలంగా వస్తాయా, లేదా కమల వికాసం కొనసాగుతుందా అన్న ఉత్కంఠ ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ వాసుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై గ్రేటర్ వరంగల్ వాసులు ఉత్కంఠ దేనికి అంటే..

Recommended Video

GHMC Election Results: first result may come on ghmc mehdipatnam division.

ముగిసిన గ్రేటర్ పోలింగ్ .. ఓటింగ్ ను లైట్ తీసుకున్న గ్రేటర్ ఓటర్లు .. కారు గుర్తు హైలెట్ చేశారని బీజేపీ ఫిర్యాదుముగిసిన గ్రేటర్ పోలింగ్ .. ఓటింగ్ ను లైట్ తీసుకున్న గ్రేటర్ ఓటర్లు .. కారు గుర్తు హైలెట్ చేశారని బీజేపీ ఫిర్యాదు

వెంటనే పట్టభద్రుల ఎమ్మెల్సీ , ఆపై గ్రేటర్ వరంగల్ ఎన్నికలు ... గ్రేటర్ వరంగల్ లో ఉత్కంఠ

వెంటనే పట్టభద్రుల ఎమ్మెల్సీ , ఆపై గ్రేటర్ వరంగల్ ఎన్నికలు ... గ్రేటర్ వరంగల్ లో ఉత్కంఠ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు తర్వాత వెంటనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు , ఆపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ వాసుల్లో జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల ప్రభావం గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో పడుతుంది అన్న భావన వ్యక్తమవుతుంది. ఇప్పటివరకూ జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే బిజెపి 74 స్థానాలలో దూసుకుపోతుంది. టిఆర్ఎస్ 30 స్థానాల్లో మాత్రమే ఆదిక్యం ప్రదర్శిస్తుంది.

కౌంటింగ్ సరళిని బట్టి ఎదురీదుతున్న టీఆర్ఎస్

కౌంటింగ్ సరళిని బట్టి ఎదురీదుతున్న టీఆర్ఎస్

ఈ కౌంటింగ్ సరళి ఇదే విధంగా కొనసాగితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కి దెబ్బ తగలడం ఖాయం. కారు జోరుకు బ్రేకులు పడటం ఖాయంగా కనిపిస్తోంది.ఇక ఈ ఎన్నికల ప్రభావం తర్వాత జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలపై, ఆ తర్వాత జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పై పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఊహించని విధంగా ఫలితాలు వస్తుండడంతో, నిన్నటి ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేస్తూ బిజెపి దూసుకుపోవడంతో రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ మొదలైంది .

ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి.. గ్రేటర్ వాసుల గ్రేటెస్ట్ తీర్పు ఎలా ఉంటుందో ?

ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి.. గ్రేటర్ వాసుల గ్రేటెస్ట్ తీర్పు ఎలా ఉంటుందో ?

ఈ ఎన్నికలను ఈసారి అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా ఎన్నికల ప్రచారం సాగింది. ఈ క్రమంలో నువ్వా నేనా అన్నట్టు సాగిన ఎన్నికలలో గ్రేటర్ వాసులు ఇవ్వనున్న గ్రేటెస్ట్ తీర్పు భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి, ఆ తర్వాత వచ్చే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కారణంగా అటు టిఆర్ఎస్ పార్టీ వర్గాలలో టెన్షన్ మొదలైంది. బీజేపీ నేతలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు.

 దుబ్బాక తరహాలో ఈసారి కూడా టీఆర్ఎస్ కు ఇబ్బంది తప్పదా ?

దుబ్బాక తరహాలో ఈసారి కూడా టీఆర్ఎస్ కు ఇబ్బంది తప్పదా ?

ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలోనూ ఉనికి కోల్పోయింది . ఈ ఫలితాలు తర్వాత జరగనున్న ఎన్నికలను ప్రభావితం చేస్తాయనే వాదన ఉన్న కారణంగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగిలితే ఇక వరుసగా దెబ్బలు తగలడం ఖాయమని తెలుస్తుంది. కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున వలసలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది . ఏదేమైనప్పటికీ జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై, ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

English summary
The results of the Greater Hyderabad elections will be followed immediately by the graduate MLC elections, and then the Greater Warangal Municipal Corporation elections. In this context, there is a perception among the people of Greater Warangal that the GHMC election results will have an impact on the Greater Warangal elections. That is why there is universal interest in GHMC election counting across the state. With the unexpected results coming out, a big debate has started in the political circles as the BJP stormed out of yesterday's exit polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X