గ్రేటర్ వార్ .. ఓల్డ్ మలక్ పేట్ లో పోలింగ్ రద్దు .. గుర్తుల తారుమారు, ఆందోళనలతో ఈసీ నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హోరాహోరీగా ప్రచారం తర్వాత జరుగుతున్న పోలింగ్ లో ఇప్పటివరకు గ్రేటర్ వాసులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు పోలింగ్ మందకొడిగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది.
గ్రేటర్ వార్ .. కొనసాగుతున్న పోలింగ్ .. పాతబస్తీలో హై అలెర్ట్ ... రీజన్ ఇదే

ఓల్డ్ మలక్ పేట్ లో ఎన్నికలను నిలిపివేసిన ఎన్నికల సంఘం
తాజాగా ఒక పార్టీ గుర్తు బదులు మరో పార్టీ సింబల్ బ్యాలెట్ పత్రాలపై అధికారులు ముద్రించడం తో ఓల్డ్ మలక్ పేట్ లో గందరగోళం నెలకొంది.
అధికారుల తప్పిదంగా పరిగణించి ఎన్నికల కమీషన్ అక్కడ పోలింగ్ నిలిపివేసింది. మళ్ళీ మరోసారి రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది . ఓల్డ్ మలక్ పేట్ డివిజన్లో ఏకంగా ఎన్నికల గుర్తును మార్చేసారు ఎన్నికల అధికారులు. ఓల్డ్ మలక్ పేట డివిజన్ 26 వ వార్డులో సీపీఐ అభ్యర్థి పోటీ చేస్తుండగా సిపిఎం గుర్తు ముద్రించారు. ఎన్నికల అథారిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంది .పోలింగ్ ను నిలిపివేసింది .

సీపీఐ గుర్తు కంకి కొడవలికి బదులుగా సిపిఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి ముద్రించిన అధికారులు
సిపిఐ ఎన్నికల గుర్తు కంకి కొడవలి కి బదులుగా సిపిఎం ఎన్నికల గుర్తు అయిన సుత్తి కొడవలి బ్యాలెట్ లో ముద్రించారు అధికారులు. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల గుర్తులు మారడంతో పోలింగ్ నిలిపివేయాలని సిపిఐ డిమాండ్ చేసింది.ఈ ఎన్నికలలో సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే పోటీ లో ఉంది సీపీఐ అభ్యర్థి కావడంతో , బ్యాలెట్ పత్రాలలో అధికారులు ముద్రించిన గుర్తు సిపిఎం గుర్తు కావడంతో గందరగోళం నెలకొంది.

ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి
అధికారులు గుర్తునే మార్చేసి బ్యాలెట్ పత్రాలు ముద్రించడం తో సిపిఐ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలను నిలిపివేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఓల్డ్ మలక్‌పేటలో ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం బయటపడిందన్నారు సీపీఐ నాయకులు . ఓల్డ్ మలక్ పేట్ లో ఆందోళన చేశారు . ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం వల్లే గుర్తులు మారాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మండిపడ్డారు . దీంతో తాజా పోలింగ్ రద్దు చేసిన ఎన్నికల అధికారులు మరోమారు పోలింగ్ నిర్వహించనున్నారు .