గ్రేటర్ వార్ .. కూకట్ పల్లిలోఉద్రిక్తత .. మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారాన్ని జరిపినా పోలింగ్ మాత్రం పెద్దగా గ్రేటర్ ఓటరును ఎన్నికలవైపు మళ్లించినట్టు కనిపించటం లేదు. పోలింగ్ చాలా మందకొడిగా నమోదు అవుతుంది . ఈరోజు గ్రేటర్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వివాదాస్పద ప్రచారాలు అనంతరం, పాలు ఉద్రిక్తతల అనంతరం చోటుచేసుకుంటున్న ఈ పోలింగ్ సజావుగా సాగాలని పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
గ్రేటర్ ఎన్నికల వేళ.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

ఉదయం నుండి కొనసాగుతున్న ఘర్షణలు .. తాజాగా కూకట్ పల్లి లో
జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ లో పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఉదయం నుండి పలు చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్ లో పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుండి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఘర్షణలకు దిగుతూనే ఉన్నారు . పోలీసులు వారిని చెదరగొట్టి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా కూకట్పల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

ఫోరం మాల్ దగ్గర టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ .. గులాబీ నేతలు డబ్బులు పంచుతున్నారని
జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఘర్షణలు , దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కూకట్ పల్లి ఫోరమ్ మాల్ దగ్గర టిఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు అంటూ బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రవాణా శాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంలో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు బిజెపి కార్యకర్తలు.

కూకట్ పల్లిలో ట్రాఫిక్ జామ్ .. మంత్రి కాన్వాయ్ పై దాడి ... అద్దాలు ధ్వంసం
కూకట్ పల్లి ఫోరం మాల్ దగ్గర టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల గొడవ తో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయితే ఈ గొడవ జరిగిన సమయంలో కార్ లో మంత్రి పువ్వాడ అజయ్ లేనట్లు సమాచారం. డబ్బులు పంచుతున్నారని టిఆర్ఎస్ కార్యకర్త పై బిజెపి కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మంత్రి కాన్వాయ్ ని వెంబడించి మరీ అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు .
ఘర్షణలతో పోలింగ్ శాతం తగ్గే అవకాశం .. టెన్షన్ లో పోలింగ్
ఒకపక్క కరోనా వైరస్, మరోపక్క మొదటి రెండు గంటల్లో 4.2 శాతం మాత్రమే నమోదైన పోలింగ్ వెరసి పోలింగ్ ఎలా సాగుతుంది అన్నదానిపై, ఎంత శాతం నమోదు అవుతుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో నగరంలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, కొనసాగుతున్న దాడులు, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ఓటు వేయడానికి కావలసిన ప్రశాంత వాతావరణాన్ని కలిగించేలా కనిపించడం లేదు. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే గ్రేటర్ లో పోలింగ్ తక్కువ శాతం నమోదయ్యే అవకాశం ఉంది.