హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ వార్ .. హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు ఎక్కడ ? ప్రశ్నించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

జిహెచ్ఎంసి ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి పలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవన్నీ టీఆర్ఎస్ హయాంలో నెరవేరేవి కాదని టీపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. గతంలో కేసీఆర్ హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరినీళ్ళలా మారుస్తానని చెప్పారన్నారు .

గ్రేటర్ వార్: ఉస్మానియాలోకి వెళ్ళిన బీజేపీ ఎంపీ తేజశ్వి సూర్య..అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తతగ్రేటర్ వార్: ఉస్మానియాలోకి వెళ్ళిన బీజేపీ ఎంపీ తేజశ్వి సూర్య..అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత

హుస్సేన్ సాగర్ నీరు కొబ్బరి నీళ్లలా మారాయా.. చెప్పాలన్న ఉత్తమ్

హుస్సేన్ సాగర్ నీరు కొబ్బరి నీళ్లలా మారాయా.. చెప్పాలన్న ఉత్తమ్

హుస్సేన్ సాగర్ నీరు కొబ్బరి నీళ్లలా మారాయా అనేది చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశాన్ని తాకేలా అందమైన భవనాలు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ఎందుకు నిర్మించలేదో చెప్పాలని గాంధీభవన్ లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. చెప్పిందే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ లో ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారని, అయితే ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ్యవహారం ఏమైంది అంటూ ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లేవి ?

లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లేవి ?

నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ కి మెట్రో రైలు తీసుకువచ్చింది టిఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలాల ఆధునికీకరణ గురించి గతంలో అనేక మార్లు చెప్పారని కానీ ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయారంటూ విమర్శలు గుప్పించారు.
సెలూన్లకు ఉచిత విద్యుత్ హామీని గతంలో ఎన్నోమార్లు చెప్పారని మళ్లీ అదే హామీ ఇప్పుడు చెప్తున్నారు అంటూ మండిపడ్డారు.

టిఆర్ఎస్ పార్టీ వైఖరితో మెట్రోకు నష్టం

టిఆర్ఎస్ పార్టీ వైఖరితో మెట్రోకు నష్టం

ఎంఐఎం కోసం పాతబస్తీ వరకు మెట్రోని తీసుకు వెళ్లలేదని, టిఆర్ఎస్ పార్టీ వైఖరితో మెట్రోకు నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ తాయిలాలు ఇవ్వటం మామూలేనని, ఆ తర్వాత మర్చిపోతారు కూడా అంటూ టిఆర్ఎస్ మేనిఫెస్టోనుద్దేశించి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నగర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

English summary
TPCC president Uttam Kumar Reddy said the people of Hyderabad should be vigilant about the assurances given by the TRS party and not all of them would be fulfilled during the TRS regime. Earlier, KCR had said that Hussain Sagar would turn water into coconut water. He asked if the Hussain Sagar water had turned into coconut water. Uttam Kumar Reddy asked what happened to the double bedroom houses for the poor people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X