హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, అన్ని పిటిషన్లు కొట్టివేత, 80 శాతం కూల్చివేత..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు ఆమోదం తెలిపింది. సెక్రటేరియట్ కూల్చివేతకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ అన్నింటినీ ధర్మాసనం కొట్టివేసింది. ఇఫ్పటికే 80 శాతం భవనాలను కూల్చివేయగా.. మిగతా 20 శాతం భవనాల కూల్చివేత ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. మరింత వేగంగా కూల్చివేత పనులు జరగనున్నాయి.

సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు మళ్లీ స్టే: ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్‌పై వాడీవేడీగా వాదనలుసచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు మళ్లీ స్టే: ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్‌పై వాడీవేడీగా వాదనలు

పీఎల్ విశ్వేశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసానం శుక్రవారం కొట్టివేసింది. సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదని.. కొత్తగా నిర్మించే భవనాలకు మాత్రమే అనుమతులు అవసరమని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. ల్యాండ్ ప్రిపరేషన్‌లోనే భవనాల కూల్చివేత వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదన్న సొలిసిటర్ జనరల్ వాదనను హైకోర్టు ఏకీభవించింది.

green signal for the demolition of the telangana secretariat..

Recommended Video

Engineering Colleges to Reopen In August in Telangana విద్యా శాఖపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు!!

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకున్నాకే కూల్చివేత పనులను చేపడుతుందని స్పష్టంచేసింది. భవనాల కూల్చివేతకు ప్రభుత్వానికి అన్ని అధికారులు ఉన్నాయని పిటిషన్ కొట్టివేసింది. అయితే కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకుని కూల్చివేత పనులు చేపట్టాలని సూచించింది.

English summary
highcourt green signal for the demolition of the telangana secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X