హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్ న్యూస్.. ఆ అభ్యర్థుల హైట్ తగ్గింపు.. సివిల్స్ మాదిరిగానే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్పీ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి అభ్యర్థుల ఎత్తు తగ్గించింది. గ్రూప్-1 నియామకాల్లో భాగంగా భ‌ర్తీ చేసే డీఎస్పీ ఉద్యోగ అభ్య‌ర్థుల ఎత్తును 167 సెంటీ మీట‌ర్ల నుంచి 165 సెంటీ మీట‌ర్ల‌కు త‌గ్గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. శుక్రవారం తెలంగాణ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎత్తు ఎక్కువగా ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. యూపీఎస్సీ నిర్వ‌హిస్తున్న సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లో కూడా ఐపీఎస్ అభ్య‌ర్థుల ఎత్తు 165 సెంటీ మీట‌ర్లే ఉన్న‌ప్పుడు తెలంగాణ మాత్రం డీఎస్పీ అభ్య‌ర్థుల ఎత్తు 167 సెంటీమీట‌ర్లు ఎందుకంటూ మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది.

పోలీస్ ఉద్యోగాల (కానిస్టేబుల్, ఎస్ఐ) దరఖాస్తు గడువును పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ (మే 20) రాత్రి 10 గంటలతో గడువు ముగుస్తుంది. ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత 2 రోజుల నుంచి పోలీస్ రిక్రూట్ మెంట్ వెబ్ సైట్ పని చేయడం లేదని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దరఖాస్తు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

group-1 dsp candidates height is decreased

మరోవైపు కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు సంబంధించి.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రెండేళ్ల వయో పరిమితిని పెంచుతూ సీఎం కేసీఆర్‌ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థుల విన్నపాలను ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించి, చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని ఆదేశించారు.

పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్లు, రవాణ శాఖల్లో కలిపి 17వేల 291 యూనిఫాం ఉద్యో‌గాల భర్తీకి ఈ నెల 2 నుంచి దర‌ఖాస్తు ప్రక్రియ ప్రారం‌భమైన విషయం తెలి‌సిందే. అన్ని విభా‌గా‌లకు కలిపి గురు‌వారం వరకు 5.2 లక్షల మంది అభ్య‌ర్థుల నుంచి 9.33 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చాయి. మహిళా అభ్య‌ర్థుల నుంచే 2.05 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చా‌యి.

English summary
group-1 dsp candidates height is decreased in the telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X