హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టిసీ బస్‌లో కాల్పులు జరిపింది ఏపీ పోలీస్.. అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ నగర నడిబొడ్డు పంజగుట్ట వద్ద బస్‌లో ఫైరింగ్ జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఇంటలీజెన్స్ సెక్యూరిటి విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి వద్ద గన్‌మెన్ గా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే అప్రత్తమైన గాలింపు చర్యలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సదరు వ్యక్తిని కొద్ది గంటల్లో కనుగొని అరెస్ట్ చేశారు...

పంజగుట్ట వద్ద బస్‌లో కాల్పులు జరిపింది ఓ గన్‌మెన్

పంజగుట్ట వద్ద బస్‌లో కాల్పులు జరిపింది ఓ గన్‌మెన్

పంజగుట్టలో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటలీజెన్స్ విభాగంలో పనిచేస్తున్నఓ గన్‌మెన్ గా శ్రీనివాస్ ఈ కాల్పులకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. తన విధులు ముగించుకుని వెళ్తున్న కానిస్టేబుల్ తనతోపాటు బస్‌లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి మధ్య ఘర్షణ, కాల్పులకు కారణమైనట్టు తెలుస్తోంది. అయితే ఫైరింగ్ అయిన సమయంలో అటు బస్ డ్రైవర్ గాని ,ఇటు ఇతర వ్యక్తులు ఎవరు కూడ పిర్యాధులు చేయకపోయినా ...మీడియా ద్వార సమాచారాన్ని సేకరించిన హైదరాబాద్ పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని కనుగొని కూకట్‌పల్లిలో ఉంటున్న శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.

సంఘటనను ఖండించిన ఏపీ డీజీపీ

సంఘటనను ఖండించిన ఏపీ డీజీపీ

కాల్పుల ఘటనకు పాల్పడింది ఏపి పోలీస్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ కావడంతో ఏపి డీజీపీ ఠాకూర్ స్పందించారు. బహిరంగంగా కాల్పులకు పాల్పడడాన్ని ఆయన ఖండించారు. ఈనేపథ్యలోంలోనే తెలంగాణ పోలీసులు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నట్టు డీజీపీకి సమాచారం ఇచ్చారు.

నేపథ్యం...

నేపథ్యం...

గురువారం ఉదయం హైదరాబాద్ పంజగుట్ట ప్రాంతంలోని ఓ ప్రయాణికుడు బస్‌లో వెళ్తున్న మరో ప్రయాణికుడిపై కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. పంజగుట్ట ప్రాంతం నుండి జూబ్లీహిల్స్ వైపు వెళుతున్న బస్‌లో పంజగుట్ట బస్ స్టాప్ వద్ద ఎక్కిన ప్రయాణికుడు మరో ప్రయాణికుడితో వాగ్వావాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇది ఘర్షణగా మారడంతో ఎదుటి వ్యక్తిపై వెంటనే సదరు వ్యక్తి తన వద్ద ఉన్న గన్ తో బస్‌లోనే పైకి కాల్పులు జరిపాడు . అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి సాఫిగా వెళ్లిపోయాడు. బస్‌లో మీడియాకు సంబంధించిన వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

English summary
Gun fire at panjagutta in hyderabad , and he escaped from the bus .There is a clash between the two passengers on the RTC bus. The police found the person who opend fire in the bus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X