హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ నిందితులను చంపినట్టే హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డిని చంపాలని డిమాండ్.. గవర్నర్ కు వినతిపత్రం

|
Google Oneindia TeluguNews

హాజీపూర్ మారణ కాండ .. అభం శుభం తెలియని బాలికలను దారుణంగా రేప్ చేసి హతమార్చిన ఘటనలు ఎవరూ మర్చిపోలేని దారుణం. ఇక సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి , అతను చేసిన ఘాతుకాలు ప్రతి ఒక్కరికి రక్తం మరిగేలా చేస్తాయి. వరుస హత్యలతో భయోత్పాతం సృష్టించిన హాజీపూర్‌ హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసుల విచారణ దాదాపు పూర్తయ్యింది .

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. కేసీఆర్ కు విజ్ఞప్తిఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. కేసీఆర్ కు విజ్ఞప్తి

హాజీపూర్ సైకో శ్రీనివాస్ రెడ్డి కి ఉరి శిక్ష వెయ్యాలనే డిమాండ్

హాజీపూర్ సైకో శ్రీనివాస్ రెడ్డి కి ఉరి శిక్ష వెయ్యాలనే డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి అతి దారుణంగా హతమార్చాడు. నరరూప రాక్షసుడు మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్య చేసి పాడుబడిన బావుల్లో పూడ్చిపెట్టిన దుర్మార్గుడు అయిన శ్రీనివాస్ రెడ్డి కి ఉరి శిక్ష వెయ్యాలని గ్రామస్తులే కాదు రాష్ట్రం మొత్తం ఆ ఘటనలు వెలుగులోకి వచ్చిన సమయంలోనే డిమాండ్ చేసింది.

గవర్నర్ తమిళిసై ని కలిసిన బాధిత కుటుంబాలు

గవర్నర్ తమిళిసై ని కలిసిన బాధిత కుటుంబాలు

అందరి మధ్య తిరుగుతున్న మానవ మృగానికి మరణ దండనే సరైంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అటు హాజీపూర్ గ్రామస్తులే కాదు ఆ శాడిస్ట్ ను కన్నతల్లిదండ్రులు సైతం ఉరి శిక్ష వెయ్యాలని చెప్పారు . ఈ ఘటనలు వెలుగులోకి వచ్చి చాలా కాలం అవుతున్నా ఇంకా నిందితుడికి శిక్ష పడట్లేదని హాజీపూర్‌ వరుస హత్యలు చేసిన నిందితుడిని ఉరి తీయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘం నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు.

గవర్నర్ కు వినతిపత్రం అందించిన బీసీ సంఘం నేతలు, బాధిత కుటుంబాలు

గవర్నర్ కు వినతిపత్రం అందించిన బీసీ సంఘం నేతలు, బాధిత కుటుంబాలు

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ను కలిసిన వారు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేయాలని, తమ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.గవర్నర్‌ ను కలిసిన అనంతరం శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నేరస్తుడిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందుకే గవర్నర్ ను కలిశామని వారు చెప్పారు.

దిశా నిందితుల ఎన్ కౌంటర్ లాగే శ్రీనివాస్ రెడ్డి ని ఎన్ కౌంటర్ చెయ్యాలని డిమాండ్

దిశా నిందితుల ఎన్ కౌంటర్ లాగే శ్రీనివాస్ రెడ్డి ని ఎన్ కౌంటర్ చెయ్యాలని డిమాండ్

గవర్నర్‌ కూడా ఆ ఘటనలు తన దృష్టికి వచ్చాయని ,తన లిస్ట్‌లో హాజీపూర్‌ సమస్య ఉందని, తనకు ఈ విషయానికి సంబంధించి మొత్తం తెలుసన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. బాధితురాళ్ల తల్లిదండ్రులు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. దిశ ఘటనలో నిందితులను ఎలా చంపారో శ్రీనివాస్‌రెడ్డి ని కూడా అదే విధంగా చంపాలని గవర్నర్‌ ను కోరామని తెలిపారు.

English summary
The victim's families of Hajipur serial murder case are met Telangana governor Tamilisai Soundararajan today. According to the reports, the victim's families are demanding encounter of Marri Srinivas Reddy, the accused in gruesome rape and murder case of three young girls. they said that they are met governor for seeking justice to them. They expressed anguish and questioned why the government is tight-lipped and not taking any action against accused even six months after the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X