• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హరీష్ రావుకు కేటీఆర్ సవాల్.. బొక్కబొర్లాపడ్డ బామ్మర్ది..!

|

హైదరాబాద్ : బావకు బామ్మర్ది ఛాలెంజ్ చేశారు. మీకంటే నేనే గ్రేట్ అనేలా నిరూపించుకుంటానని సవాల్ విసిరారు. మీకన్నా ఒకటి, రెండన్నా మాకు ఎక్కువ రాకపోతాయా అంటూ రెచ్చగొట్టారు. ఇదంతా కూడా బావబామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ. లోక్‌సభ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఆయా జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. ఆ క్రమంలో మెదక్ జిల్లాకు వెళ్లినప్పుడు అక్కడి పార్లమెంటరీ స్థానం కన్నా.. కరీంనగర్‌లో మెజార్టీ ఎక్కువ తెచ్చుకుంటామంటూ వ్యాఖ్యానించారు.

మెదక్ ఎంపీ స్థానంలో వచ్చే ఓట్లకన్నా.. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటరీలో రెండు ఓట్లు ఎక్కువే తెచ్చుకుంటామే తప్ప ఎక్కడా తగ్గబోమని మాట్లాడారు. తీరా ఫలితాలు చూస్తే మాత్రం మెదక్‌లో బ్రహ్మాండమైన మెజార్టీ వస్తే.. కరీంనగర్ స్థానం మాత్రం చేజారిపోయింది.

ఏమంటారు కేటీఆర్.. చెల్లని రూపాయిల లెక్క తేలిందా..!

మనకు పోటీ ఎవరూ కాదు.. మనలో మనకే పోటీ..!

మనకు పోటీ ఎవరూ కాదు.. మనలో మనకే పోటీ..!

లోక్‌సభ ఎన్నికల వేళ మెదక్ జిల్లాలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆ వేదికపై హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ తమకు పోటీ కాదన్నారు. మన పార్టీలోనే మనకు పోటీ ఉందన్నారు. కరీంనగర్, వరంగల్‌ను మించి మెదక్‌లో 5 లక్షల ఓట్లతో బ్రహ్మాండమైన మెజార్టీ కొడదామన్నారు. మెదక్ గౌరవం మరింత పెరిగేలా, సీఎం కేసీఆర్‌కు మంచి బహుమానం ఇచ్చేలా అక్కడి పార్లమెంటరీ స్థానంలో బంపర్ మెజార్టీ సాధించుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దానికి కౌంటర్‌గా కేటీఆర్ సవాల్ విసిరారు.

కరీంనగర్, వరంగల్ కంటే మెదక్‌లో ఎక్కువ మెజార్టీ తెచ్చుకుందామని హరీష్ రావు అనేసరికి.. కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని సిరిసిల్ల నుంచి తాను ఎమ్మెల్యేగా ఉన్నానని.. మీకంటే మేమే ఎక్కువగా మెజార్టీ తెచ్చుకుంటామని ఛాలెంజ్ చేశారు.

బావతో కాదు.. సీఎంతో సవాల్..!

బావతో కాదు.. సీఎంతో సవాల్..!

కేటీఆర్ అలా ఛాలెంజ్ విసరగానే.. అక్కడే ఉన్న సీనియర్ లీడర్ ఎవరో బావబామ్మర్దుల సవాల్ అంటూ అరిచారు. దానికి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. బావతో కాదు డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే అంటూ సమాధానమిచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లోక్‌సభ నియోజకవర్గం కంటే కరీంనగర్‌లో ఒకటి, రెండు ఓట్లన్నా ఎక్కువ తెచ్చుకుంటామని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో ఒక గజ్వేల్ నుంచే లక్ష మెజార్టీ ఖాయమని సీఎం చెప్పారు. మరి ఆ లెక్కన సిద్దిపేటలో ఒక లక్ష, పటానుచెరులో మరో లక్ష.. ఇలా అన్ని లక్షలు కలిపితే ఆరు, ఏడు లక్షల మెజార్టీ రావాలి. సరే, మీవోళ్ల లెక్కలు తప్పున్నాయి. మరి 5 లక్షల మెజార్టీ వస్తదా, 7 లక్షల మెజార్టీ వస్తదా.. చూసుకుందామంటూ వ్యాఖ్యానించారు. నన్ను మెదక్‌కు పిలిచి మీరు తొడ కొట్టారు కదా.. తప్పకుండా మీకన్నా మేమే కరీంనగర్‌లో మెజార్టీ ఎక్కువ తెచ్చుకుంటామన్నారు.

 హరీష్ రావు సక్సెస్.. మరి కేటీఆర్..!

హరీష్ రావు సక్సెస్.. మరి కేటీఆర్..!

లోక్‌సభ ఎన్నికల వేళ బావకు సవాల్ విసిరారు సరే.. మరి ఆ లెక్కన ఫలితాలు రావాలి గదా. మెదక్ పార్లమెంటరీ స్థానం కంటే ఒకటో, రెండో ఎక్కువ తెచ్చుకుంటామన్న కేటీఆర్ ఛాలెంజ్ ఏమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. మెదక్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించడానికి హరీష్ రావు తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. 5 లక్షల బంపర్ మెజార్టీ సాధిస్తామన్నారు. అందుకు తగ్గట్టుగానే తెలంగాణలోనే అత్యధికంగా 3 లక్షల 16 వేల 427 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు.

కేటీఆర్ విషయంలో మాత్రం సీన్ రివర్సయింది. కరీంనగర్ స్థానం టీఆర్ఎస్ ఖాతాలో నుంచి చేజారింది. అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 89 వేల 508 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మెదక్ కంటే ఒకటో, రెండో ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటామని బావతో బామ్మర్ది ఛాలెంజ్ చేసినా.. ప్రజలు మాత్రం విలక్షణమైన తీర్పు ఇచ్చారు. కేటీఆర్ సవాల్ విసిరినట్లు ఒకటి, రెండు ఓట్లు ఎక్కువ రావడం సంగతేమో గానీ.. అసలుకే ఎసరొచ్చి కరీంనగర్‌లో టీఆర్ఎస్ బొక్కబొర్లా పడింది.

బావబామ్మర్దుల ఫన్నీ సవాల్.. చివరకు ఇలా..!

బావబామ్మర్దుల ఫన్నీ సవాల్.. చివరకు ఇలా..!

మనకు ఎవరు పోటీ కాదు.. మెజార్టీలో మన పార్టీలో మనకే పోటీ ఉండాలంటూ అప్పటి మెదక్ సమావేశంలో హరీష్ రావు వ్యాఖ్యానించారు. దానికి సరాదాగా కేటీఆర్ సవాల్ విసిరినా.. క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్సయింది. హరీష్ రావు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా.. పార్టీ అభ్యర్థిని గెలిపించి తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ కట్టబెట్టడం విశేషం. మరి కేటీఆర్ మెదక్‌తో పోటీపడి కరీంనగర్ స్థానాన్ని ఎందుకు గెలిపించుకోలేకపోయారనే వాదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి బావబామ్మర్దుల ఫన్నీ సవాల్ చివరకు ఇలా ముగిసింది.

English summary
In Lok Sabha Election Campaign, KTR challenged to Harish rao on Majority. He said that karim nagar will get more majority compares to medak constituency even one or two votes. By the results, Harish rao succeed with 3 lakhs above majority in Medak MP seat. But KTR fails while karimnagar mp seat lost TRS party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more