• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడమా.. బిగ్ జోక్ : హరీశ్ రావు

|

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు స్థానం గురించి వేరే చెప్పనక్కర్లేదు. సీఎం కేసీఆర్ మేనల్లుడిగానే కాదు.. వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. మామ బొమ్మెస్తే.. అల్లుడు రంగేసే టైపు. అలా కేసీఆర్ మార్గదర్శకత్వంలో, ఆయన కనుసన్నల్లో పనిచేస్తారు. అలాంటిది హరీశ్ రావు పార్టీ మారుతారా? కేసీఆర్ తో ఆయనకు పొసగడం లేదా? ఇలాంటి ఎన్నో ఊహాజనిత వ్యాఖ్యలను ఆయన చాలా సందర్భాల్లో కొట్టిపారేశారు కూడా.

మంత్రివర్గ విస్తరణ సమయంలో హరీశ్ రావుకు కేబినెట్ లో చోటు దక్కనప్పుడు సైతం ఆయన ఒకటే విషయం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తాను, అధిష్టానం ఏది చెబితే అది చేస్తాను అనేది ఆ మాటల సారాంశం. అయితే ఆయన టచ్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందిస్తూ.. బిగ్ జోక్ అంటూ కొట్టిపారేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మామకు తోడుగా..!

మామకు తోడుగా..!

టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానం మొదలు కేసీఆర్ వెన్నంటి ఉన్న హరీశ్ రావు పార్టీలో కీ రోల్ పోషించారు. మామ తర్వాత అల్లుడే అన్నంతగా పార్టీశ్రేణుల్లో జవసత్వాలు నింపారు. గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఎంతోమంది ఇతర పార్టీల నేతలను కారెక్కించడంలో హరీశ్ రావు ప్రధాన పాత్ర పోషించారు. ఎన్నికలైనా, ఏ కార్యక్రమమైనా, తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి మామ చేత శభాష్ అనిపించుకున్నారు. మామ చెప్పిందే వేదంగా క్షేత్రస్థాయిలో హరీశ్ రావు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు.

పిట్టీ కేసుల్లో ప్రతాపం.. సైకో కేసులో ఫెయిల్యూర్?.. పోలీసులకు శీనుగాడి తిప్పలు..!

మంత్రి పదవి రాకపోయేసరికి..!

మంత్రి పదవి రాకపోయేసరికి..!

ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక మంత్రిగా సేవలు అందించారు హరీశ్ రావు. ప్రభుత్వంలో తనవంతు పాత్ర సమర్థవంతంగా పోషించారు. అయితే మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చాక.. హరీశ్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో చాలా రకాల కామెంట్లు చక్కర్లు కొట్టాయి. మామకు, అల్లుడికి పొసగడం లేదని.. హరీశ్ రావు తన దారి తాను చూసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. అప్పట్లో బీజేపీలోకి వెళుతున్నారని కొందరంటే.. కాదు కాదు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని మరికొందరు బహిరంగంగానే మాట్లాడటం గమనార్హం.

అదలావుంటే చాలా సందర్భాల్లోనూ హరీశ్ రావు అలాంటి వ్యాఖ్యలకు చెక్ పెట్టారు. ఏ పార్టీలోకి వెళ్లేది లేదని.. తన గురించి ఇలాగే చెడు ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా కూడా హరీశ్ రావు పొలిటికల్ కెరీర్ పై భిన్నరకాల కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి.

రాజగోపాల్ కు కౌంటర్..!

ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపికయ్యాయి. ఆరు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి హరీశ్ రావు తమతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమయం కోసం హరీశ్ రావు ఎదురుచూస్తున్నారని.. టీఆర్ఎస్ పార్టీకి ఆయన గండి కొట్టడం ఖాయమని చెప్పుకొచ్చారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ చర్చానీయాంశంగా మారాయి.

అదలావుంటే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమతో టచ్ లో ఉన్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులను జోడిస్తూ.. BIG JOKE అంటూ ట్వీట్ చేయడం కొసమెరుపు.

English summary
TRS MLA Harish Rao countered Congress Party MLA Komatireddy Rajagopal Reddy. He sentenced that, rajagopal reddy comments are big joke as he contacts with congress leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X