హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరీష్ రావు పని అడకత్తెరలో పోకచెక్కేనా? సీఎం కేసీఆర్ బడ్జెట్ మర్మం ఇదేనా ?

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ పార్టీలోనే ట్రబుల్ షూటర్‌ అయిన హరీష్ రావుకు ఆర్థిక శాఖను కేటాయించి సీఎం కేసీఆర్ ఇరకాటం లో పెట్టరా? గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఎన్నో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేలా చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హరీష్ రావుకు ఆర్థిక శాఖ కత్తి మీద సామేనా? ఆర్థిక శాఖ పెద్ద శాఖ అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హరీష్ రావు పరిమితులకు లోబడి పని చేయాలా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

త్వరలో 57 ఏళ్ల వృద్ధులకు పెన్షన్ అమలు, ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీ మిన్న : కేసీఆర్త్వరలో 57 ఏళ్ల వృద్ధులకు పెన్షన్ అమలు, ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీ మిన్న : కేసీఆర్

ఆర్థిక శాఖతో అంతగా పేరు రాదని హరీష్ అభిమానులు అసంతృప్తి ..

ఆర్థిక శాఖతో అంతగా పేరు రాదని హరీష్ అభిమానులు అసంతృప్తి ..

తాజాగా, మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు మంత్రి పదవి దక్కింది. సీఎం కేసీఆర్ హరీష్ రావుకు ఏకంగా ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే, కీలక శాఖే దక్కినా హరీష్ అభిమానులు మాత్రం హరీష్ రావు కు కేటాయించిన శాఖపై అసంతృప్తితోనే ఉన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన కాలంలో హరీష్‌కుచాలా మంచి పేరు వచ్చిందని, ఆర్థిక శాఖతో అంతగా పేరు రాదని వారు అభిప్రాయపడుతున్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నపుడు హరీష్ రావు ప్రాజెక్టుల వద్ద పనులను పరుగులు పెట్టించారు. ఇక ఆయన ప్రాజెక్టుల వద్దే నిద్ర పోయిన సందర్భాలు ఉన్నాయి. అవి ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేందుకు దోహదపడటమే కాకుండా, హరీష్‌ సంకల్పానికి నిదర్శనంగా మారాయి. అయితే, ఇప్పుడు ఆర్థిక శాఖ వల్ల పెద్దగా ప్రజల్లో తిరిగే అవకాశం ఉండదని, ఫైళ్లపై సంతకాలు పెట్టే వరకే పరిమితం అవుతారని హరీష్ అభిమానులు కాస్త అసంతృప్తితోనే ఉన్నారు.

 హరీష్ రావును అడకత్తెరలో పెట్టిన సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం

హరీష్ రావును అడకత్తెరలో పెట్టిన సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం

ఇక తాజాగా సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం హరీష్ రావును అడకత్తెరలో పెట్టినట్లుగా చెప్పకనే చెబుతోంది.

దేశంలోని ఆర్థిక మాంద్య పరిస్థితుల ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన కూడా ఉందని, ఇప్పుడొచ్చే ఆదాయం తగ్గిన నేపథ్యంలో రాబడి అంచనాల్ని తగ్గించిన ప్రభుత్వం, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అనుకుంటున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు . ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తామని చెప్పటంతో పాటు.. పాత బకాయిల్ని చెల్లించే వరకూ ఎలాంటి కొత్త పనులు చేపట్టమన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు.

బకాయిల చెల్లింపే తొలి ప్రాధాన్యత అన్న కేసీఆర్ .. ఇరకాటంలో హరీష్

బకాయిల చెల్లింపే తొలి ప్రాధాన్యత అన్న కేసీఆర్ .. ఇరకాటంలో హరీష్

అంతేకాదు.. బడ్జెట్ పూర్తి కాపీని వెబ్ సైట్లో పెట్టేశాం.. వాటిని చూసుకోండన్న మాటను చెప్పిన కేసీఆర్ స్పీచ్ మొత్తం విన్నాక.. కీలకమైన ఆర్థిక శాఖను మేనల్లుడు హరీశ్ కు కట్టబెట్టటం ద్వారా హరీష్ ను ఇరకాటంలో నెట్టారా అన్న భావన కలగక మానదు. ఎందుకంటే.. ఏ శాఖకు ఎంత కేటాయింపు.. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్ కు ఉండాలి.

ఇప్పటికే ఉన్న బకాయిల్ని చెల్లించటమే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పిన కేసీఆర్ దాని తర్వాతే మిగిలిన అంశాల మీద ఫోకస్ చేస్తామని చెప్పారు.

ఖజానా ఖాళీ ... ప్రజల్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు .. ట్రబుల్ షూటర్ కు ట్రబుల్

ఖజానా ఖాళీ ... ప్రజల్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు .. ట్రబుల్ షూటర్ కు ట్రబుల్


అంటే ఖాళీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఖజానా తాళపు చెవులను హరీశ్ చేతికి ఇచ్చారు. అందులోకి వచ్చే ఆదాయం ఏమైనా సరే.. తాను చెప్పిన రీతిలో బకాయిల చెల్లింపులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేశారు. ఇక దీంతో ఆర్థిక మంత్రిగా హరీష్ చేసే పని పెద్దగా ఏమీ ఉండదని కేసీఆర్ మాటలతో అర్థమవుతోంది. ఒకపక్క ఆర్థికమంత్రిగా ప్రజల్లోకి వెళ్లడానికి అవకాశం ఉండదు. మరోపక్క అద్భుతమైన పనితీరు చూపించడానికి రాష్ట్ర ఖజానాలో ఆదాయము లేదు. ఇక దీంతో సీఎం కేసీఆర్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కు ఆర్థిక శాఖను ఇచ్చి ట్రబుల్స్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు.

English summary
TRS trouble shooter Harish Rao, should assigned to the Finance Department and put in trouble. Even though the Finance Department is a key branch, should Harish Rao work within the constraints of the current economic situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X