హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మామ సభ..! అల్లుడి ఏర్పాట్లు...!చింతమడకలో హరీష్ రావు బిజీబిజీ..!!

|
Google Oneindia TeluguNews

సిద్ధిపేట/హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన స్వగ్రామైన చింతమడక గ్రామానికి రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ శుక్రవారం చింతమడకలో పర్యటించారు. గ్రామ శివారులో హెలీప్యాడ్ ఏర్పాట్లు, సమావేశం నిర్వహించే ప్రాంతాలను వారు పరిశీలించారు.

ఇంకా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై హరీష్‌రావు గ్రామస్థులతో మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చూడాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా పని చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

Harish Rao lokking arrangements of kcr tour in Chinthamadaka..!!

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా పరిషత్‌ పాలకవర్గం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. గొప్ప అనుభవం ఉన్నవారు, విద్యావంతులు ఈ సారి జిల్లా పరిషత్‌కు ఎన్నికయ్యారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా అయిన సిద్ధిపేటను రాష్ట్రంలో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.

జిల్లాలో బాగా పని చేసే అధికారులన్నారని వారి సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. సభలో, సమావేశాల్లో చర్చ అర్థవంతంగా, ప్రశ్న ఆలోచించే విధంగా ఉండాలన్నారు హరీశ్‌ రావు. హెడ్‌లైన్‌ వార్తల కోసం అరిచి గగ్గోలు పెట్టుకోవద్దని తెలిపారు. ప్రజా ప్రతినిధులు వివిధ శాఖలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేను అనే విధానంతో కాకుండా మేము అనే పద్దతిలో పని చేసుకోవాలన్నారు. పొరపాటు జరిగినప్పుడు భేషజాలకు పోకుండా ఆ తప్పును సవరించుకునే వారే గొప్పవారవుతారని హరీశ్‌ రావు పేర్కొన్నారు.

English summary
Former minister Harish Rao, district collector Venkatrami Reddy and Siddipetta CP Joel Davis were on a visit to Chintamadaka on Friday as Chief Minister Chandrasekhar Rao arrived in his home village of Chintamadaka. They examined the helipad arrangements and meeting areas in the village suburbs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X