హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నల్ల ధనాన్ని నల్లకోటులోనే తరలిస్తా..

|
Google Oneindia TeluguNews

జీరో వ్యాపారం ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం..వ్యాపారాలు చేసే వారు ప్రభుత్వానికి పన్నులు ఎగ్గేట్టేందుకు చేసే లాబీయింగ్..అయితే దీని ద్వార ఆర్ధికంగా వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దీంతో బిల్లులు లేకుండా వచ్చే నల్లధనాన్ని తరలించేందుక నానా జిమ్మిక్కులు చేస్తుంటారు. వాటిని అధికారులు,పోలీసుల , కళ్లు కప్పి నగదును అతి ఈజిగా పట్టుకొచ్చేస్తారు. ....అయితే తాజాగా పన్నుల వసూళ్లలో కేంద్రం సరళీకృతమైన నిబంధనలు తీసుకురావడంతో పాటు పన్నుల వసూళ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అయినా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.. వ్యాపారస్తులు సైతం అంతే కట్టుదిట్టమైన ఏర్పాట్లోతో ఎవరికి అనుమానం రాకుండా నల్లధనాన్ని తరలిస్తున్నారు..ఇలా నల్లధనాన్ని హైద్రబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా తన కోటులోనే తరలించి పోలీసులకు దొరికిపోయాడు.

ఈనేపథ్యంలోనే హైద్రబాద్ కు చెందిన చంద్రకాంత్ వర్మ అనే వ్యక్తి ఓ వజ్రాల వ్యాపారి వద్ద పనిచేస్తూన్నాడు. ఇలాంటీ నల్లధనం తరలించేందుకు ఓ నల్ల జాకేట్ ను ప్రత్యేకంగా తయారు చేయించాడు..ఈ జాకెట్ ద్వార ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి నగదు సులువుగా తరలిస్తున్నాడు..రాచకొండ పోలీసుల సమాచారం ప్రకారం హైద్రబాద్ జూబ్లిహిల్స్ లో ద డైమండ్ స్టోర్ లో చంద్రకాంత్ వర్మ పనిచేస్తున్నాడు..కాగా ఈ స్టోర్ యజమాని కొట్టి చంద్రప్రకాశ్ అయన వ్యాపారంలో భాగంగా పన్నులు ఎగ్గోట్టి జీరో వ్యాపారం చేస్తున్నారు..వజ్రాలను ఇతర రాష్ట్రాలకు జీరో రూపంలో తరలిస్తున్నాడు....వజ్రాలు అమ్మి అక్కడ నుండి నేరుగా డబ్బులు తెస్తున్నారు...

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత ... ఎంతంటే ?శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత ... ఎంతంటే ?

Hawala racket busted, Rs 70 lacs seized

అందుకోసం నేరుగా ధరించె జాకేట్ లోనే కోటి రుపాయల వరకు పట్టేవిధంగా ఓ బ్లాక్ జాకెట్ ను తయారు చేయించారు..అయితే నగదును తీసుకువచ్చేందుకు చంద్రకాంత్ వర్మను ఉపయోగిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే రాయ్ పూర్ కు చెందిన సునిల్ సోనియంద్ అనే వ్యాపారి నుండి చంద్రకాంత్ వర్మ తన నల్ల జాకేట్ లో 70 లక్షల రుపాయలను తరలిస్తున్నారు. దీంతో పక్కా సమాచారం అందుకున్న రాచకొండ ఎస్వోటి పోలీసులు చంద్రకాంత్ వర్మను పట్టుకునెందుకు స్కెచ్ వేశారు. నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపురం క్రాస్ రోడ్డు వద్ద కాపు కాశారు.అక్కడ చెక్ పాయింట్ లో జరిపిన తనిఖీల్లో చంద్రకాంత్ ను పట్టుకున్నట్టు సీపీ మహెశ్ భగవత్ చెప్పారు. కాగా స్టోర్ యజమాని చంద్రప్రకాశ్ పరారీలో ఉండగా, దొరికిన నగదును ఆదాయపు పన్ను శాఖకు పంపారు.

English summary
Acting on a tip-off, the Rachakonda police busted a Hawala money transfer racket operating from Raipur, Chattisgarh and apprehended one suspect apart from seizing Rs 70 lakh from him.A black jacket has been chosen for black money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X