హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాశీం కాదు కార్తీక్, మావోయిస్టులతో డీ కోడ్ చేయని విధంగా సంభాషణలు, కౌంటర్ పిటిషన్‌లో పోలీసులు

|
Google Oneindia TeluguNews

ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చింతకింది కాశీం అరెస్ట్‌పై పోలీసులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను పోలీసులు తెలియజేశారు. ప్రొఫెసర్ కాశీంతోపాటు మావోయిస్టు భావజాలం ఉన్న వారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రపన్నారని ఆరోపించారు. అండర్ గ్రౌండ్‌లో పనిచేసే మావోయిస్టులతో కాశీం నిత్యం మాట్లాడుతూనే ఉంటారని చెప్పారు.

డీ కోడ్ చేయలేం..

డీ కోడ్ చేయలేం..

మావోయిస్టులతో మాట్లాడే సమయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. మాటలను డీ కోడ్ చేయలేని విధంగా ప్రత్యేక సాప్ట్‌వేర్‌తో సంభాషణలు జరుపుతారని పేర్కొన్నారు. అంతేకాదు వారితో మాట్లాడే సమయంలో తన పేరును కూడా కాశీం అని చెప్పడని.. కార్తీక్‌గా పిలుస్తారనే సంచలన విషయాన్ని వెల్లడించారు. మావోయిస్టులతో కాశీం సంబంధాలకు సంబంధించి అన్ని అంశాలు ఆరాతీశాకే అరెస్ట్ చేశామని వివరించారు.

హార్డ్ డిస్క్, పుస్తకాలు స్వాధీనం

హార్డ్ డిస్క్, పుస్తకాలు స్వాధీనం


మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చింతకింది కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీం ఇంట్లో సోదాలు నిర్వహించి హర్డ్ డిస్క్, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఓయూలోని కాశీం ఇంట్లోకి పోలీసులు ప్రవేశించే సమయంలో తలుపులు బద్దలకొట్టారని కాశీం భార్య స్నేహలత తెలిపారు.

విప్లవ సాహిత్యం

విప్లవ సాహిత్యం

కాశీం వద్ద మావోయిస్టుల సాహిత్యం ఉందని 2016లో సిద్దిపేట జిల్లా ములుగు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో సెర్చ్ వారెంట్‌తో శనివారం గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో 15 మంది పోలీసులు ఓయూలోని కాశీం ఇంటి వద్ద సోదాలు నిర్వహించారు. కీలకపత్రాలు, కంప్యూటర్ హర్డ్ డిస్క్, సాహిత్యం, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాశీంపై ఐపీసీ 120 (బీ) నేరపూరిత కుట్ర, 121 (ఏ), 124 (ఏ), ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు.

English summary
police counter petition on ou assistant professor kasim arrest
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X