హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడు సామాన్యుడు కాదు సుమీ..! బ్యాంకుకే కన్నం వేసిన మేనేజర్‌..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తిన్నింటి వాసాలు లెక్క‌పెట్ట‌డం అంటే ఇదే..! కొలువు చేసుకోవ‌డానికి పెద్ద కార్యాల‌యం, చేతికింద ఓ 30మంది ఉద్యోగులు, నెల‌కు ల‌క్ష‌కు పైగానే జీతం, కంపెనీ వాహ‌నం.. ఇంకేముంది. ద‌ర్జాగా ఉద్యోగం చేసుకోవ‌డం మానేసి వ‌క్ర బుద్ది ప్ర‌ద‌ర్శించాడు స‌ద‌రు మేనేజ‌ర్. ఒచ్చిన జీతం, ఉద్యోగం తాలూకా హంగు, ఆర్బ‌టం చాల‌ద‌న్న‌ట్టు అత్యాశ‌కు పోయాడు ఆ బ్యాంకు ఉద్యోగి. కంచె చేను మేసిన చందంగా వ్య‌వ‌హ‌రించి న‌లుగురితో ఛీ కొట్టించుకున్నాడు ఆ ఆఫీస‌ర్. న‌టుగురికి ఆద‌ర్శ‌గా ఉండాల్సిన వ‌య‌సులో న‌టుగురితో చెప్పించుకునే స్థాయికి దిగ‌జారిపోయి న‌వ్వుల‌పాల‌య్యాడు ఆ బ్చాంకు ఉద్యోగి. అస‌లు విస‌యంలోకి వెళ్లే ఓ బ్యాకు మేనేజ‌ర్ తాను పనిచేస్తున్న బ్రాంచ్‌ను నిలువుగా ముంచిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

He is not a ordinary man..! cheated the own bank..!!

రంగారెడ్డి జిల్లా నాగర్‌గూడ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌ ఎన్‌.కృష్ణఆదిత్య అదే బ్యాంకులో తన పేరిట సేవింగ్‌ ఖాతా తెరిచాడు. తన స్నేహితుడు నీరటి కృష్ణయ్య పేరుపై రూ.9 లక్షలతో ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ) అకౌంట్‌ తెరిచాడు. ఈ బ్యాంకు పరిధిలో ఉన్న 77 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులను ఆన్‌లైన్‌ ద్వారా సేవింగ్‌ ఖాతాలోకి బదిలీ చేసుకోవడంతోపాటు ఓడీ అకౌంట్‌పై 92 లక్షలు బ్యాంకు నుంచి బదిలీ చేశాడు. బ్యాంకు మేనేజ‌ర్ గా లావాదేవీల్లో జ‌రుగే చిన్న చిన్న లోపాల‌ను ఆస‌రాగా తీసుకోవ‌డ‌మే కాకుండా, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉవ‌పోగించుకుని దాదాపు కోటి రూపాయ‌ల వ‌ర‌కు సొంత బ్యాంకుకే క‌న్నం వేసిన మేనేజ‌ర్ ను క‌ఠినంగా శ‌క్షించాలంటున్నారు ఖాతాదారులు. అనుభ‌వం ముదిరి అడ్డ‌దారులు తొక్క‌డ‌వం అంటే ఇదే సుమీ..!!

English summary
Besides taking minor drawbacks in dealing with the saving accounts, the bank manager looted approxmatey one crore rupees.Consumers have to bury the manager who has been knocked out to the bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X