హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం నుంచి మహానగరంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వరదనీటిలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరో రెండు, మూడురోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి సహా చాలాచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రహదారులపై భారీగా వర్షపునీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

heavy rain in hyderabad
heavy rain in hyderabad

శ్రీనగర్‌ కాలనీలో ఏకంగా ఓ చెట్టు విరిగిపడిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇటు గచ్చిబౌలి-హైటెక్ సిటీలో కూడా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బోయిన్ పల్లి హైవేపై కూడా భారీగా వరదనీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరోవైపు యూసఫ్ గూడలో కుండపోత వర్సంతో నిలిపిన వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోవడం కలకలం రేపింది.

English summary
Heavy rains at Hyderabad. The colonies were inundated. Traffic was stalled on major roads. Motorists were badly affected by the floodwaters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X