తెలంగాణలో వర్షం.. సూర్యాపేటలో ఎక్కువ, మంత్రి జగదీశ్ సమీక్ష
తూర్పు / ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.17వ తేదీ సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
తెలంగాణలో మొన్నటి వరకు చలి గజగజ వణికిస్తే.. ఇప్పుడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల శనివారం సాయంత్రం వర్షం కురిసింది. సెలవులు కావడంతో రోడ్లపై రద్దీ అంతగా లేకపోవడంతో ట్రాఫిక్ ఎక్కడా జాం కాలేదు. మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉంటుందో వెల్లడించింది.

ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉయదం వరకు వర్షం పడింది. ఆ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఎర్కకారంలో అత్యధికంగా 14.5 సెంటీమీటర్ల వర్ష కురిసింది. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. ఆ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు మునిసిపల్ కమిషనర్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో జగదీశ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. సహాయక సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.
ఇటు చినుకు పడితేనే నగరం చిత్తడి అయిపోతుంటుంది. నగరంలో వర్షపు నీరు నిలవడంతో లోతట్టు ప్రాంతాల వారు ఇబ్బందికి గురవుతుంటారు. తమ సమస్య పరిష్కరించమని ఎన్ని సార్లు ప్రభుత్వ పెద్దలకు చెప్పినా ఫలితం ఉండటం లేదు. ఇవే విషయాన్ని చెప్పి.. చెప్పి తమకు ఆయాసం వస్తుందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.
మరో వైపు ఉత్తరభారతాన్ని మంచుదుప్పటి కమ్మేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ హిమపాతం నమోదు అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి వాతావరణం ఉంది. చలిగాలులు వీయడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆస్తమా ఉన్నవారు అయితే ఇంటి నుంచి బయటకు రావడం లేదు. చలిగాలుల తర్వాత కాసేపు ఎండ వచ్చిన జనం సంతోష పడుతున్నారు. కానీ ఆ వెంటనే మబ్బులు వచ్చి.. చల్లని వాతావరణం ఉంది. దీంతో ఊసురుమనడం వారి వంతవుతుంది.