హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నువ్వు గొప్పోడివి బాసు... ఇదీ ముందు జాగ్రత్త అంటే... వరదల ఎఫెక్ట్‌‌తో ఏం చేశాడంటే...

|
Google Oneindia TeluguNews

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ వాసులకు మునుపెన్నడూ లేని చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. ఎటు చూసినా బురద,వరదలో కొట్టుకుపోయిన వాహనాలు,భరించలేని దుర్గంధంతో జనం తల్లడిల్లుతున్నారు. వాన మబ్బు కమ్ముకుందంటే చాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు తెల్లారేసరికి ఉంటాయో.. వరదలో కొట్టుకుపోతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి టెన్షన్ ఏదీ అవసరం లేకుండా ఓ భాగ్యనగర వాసి భలే జాగ్రత్తపడ్డాడు.

 వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు

తాడుతో కారును గేటుకు...

తాడుతో కారును గేటుకు...

ఇటీవలి వర్షాలకు హైదరాబాద్‌లో చాలా కాలనీలు నీట మునిగి ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ హైదరాబాద్ వాసి ముందు జాగ్రత్తగా... ఇంటి ముందు పార్క్ చేసిన తన కారును తాడుతో గేటుకు కట్టేశాడు. దీంతో ఇక ఎంత వరద వచ్చినా... కారు ఎక్కడికి కొట్టుకుపోదన్న నమ్మకం. ఈ కారుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ పలు ఫన్నీ కామెంట్స్‌తో పాటు ఫన్నీ మీమ్స్‌తో దీన్ని మరింత వైరల్ చేస్తున్నారు.

నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్...

నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్...

హైదరాబాద్‌లో గతంలో తడి చెత్త,పొడి చెత్త కోసం రెండు బుట్టలను ఇచ్చినట్లు... ఇప్పుడు ఒక చైన్,తాడు ఇస్తే బాగుంటుందని ఓ నెటిజన్ ఆ ఫోటోపై ఫన్నీ కామెంట్ చేశాడు. మరికొందరేమో... పాపం వరదలో కారు కొట్టుకుపోవద్దని అతను చేసిన ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నామంటూ కామెంట్ చేశారు. భారీ వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందు జాగ్రత్త పడ్డాడు.. భలే ఐడియా... అని ఇంకొందరు కామెంట్ చేశారు.

వరదల్లో వాహనాలు... వీడియోలు వైరల్..

వరదల్లో వాహనాలు... వీడియోలు వైరల్..

హైదరాబాద్ వరదల్లో ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓచోట వరదలో కొట్టుకొచ్చిన కారు ఢీకొనడంతో... ఒక కారుపై మరో కారు ఎక్కిన దృశ్యాలు విపరీతంగా వైరల్‌ అయ్యాయి. చాలాచోట్ల బైక్స్ కొట్టుకుపోయాయి. దీంతో ఇంటి ముందు వాహనం పార్క్ చేయాలంటే జనం భయపడిపోతున్నారు. ఏ అర్ధరాత్రో భారీ వాన కురిస్తే... తెల్లారేసరికి తమ వాహనం ఉంటుందో... వరదలో కొట్టుకుపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. సినీ నటుడు బ్రహ్మాజీ సైతం ఈ వరదలపై ట్విట్టర్‌లో ఫన్నీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంట్లోకి నీళ్లు చేరిన ఫోటోలను షేర్ చేసిన బ్రహ్మాజీ... ఒక మోటార్ బోట్ కొనాలనుకుంటున్నానని... ఏ పడవ బాగుంటుందో చెప్పాలని నెటిజన్స్‌ను కోరాడు.

మబ్బులు పడితే చాలు...

మబ్బులు పడితే చాలు...

గత వారం నుంచి హైదరాబాద్‌ను వాన విడవట్లేదు. ఉదయాన ఎండ కనిపిస్తున్నా... ఏ సమయాన హఠాత్తుగా మబ్బులు కమ్ముకుంటాయో తెలియట్లేదు. అలా మబ్బులు కమ్ముకున్నాయంటే చాలు నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు కాలు పెట్టట్లేదు. గతంలోనూ ఎన్నోసార్లు హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తినా... ఇలాంటి భారీ వర్షాలను మాత్రం చూడలేదని జనం వాపోతున్నారు. పైగా ఈ వర్షాలకు విష జ్వరాలు,డయేరియా వంటి రోగాలు ముసురుకునే అవకాశం ఉండటంతో మరింత ఆందోళన చెందుతున్నారు.

English summary
A Hyderabad man tied his car to house gate with the fear of floods due to heavy rains in the city.From last one week heavy rains pouring in Hyderabad,somany vehicles were washed away in floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X