హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీ వర్షాలు: 3 రోజులు బయటకి రావొద్దని హెచ్చరిక, దగ్గరలోనే తీవ్ర వాయుగుండం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం వణికిపోతోంది. నగరంలోని అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. దాదాపు 1500 కాలనీల్లో నడుము లోతు వరకు వరద నీరు చేరుకోవడం గమనార్హం. రహదారులు పూర్తి జలమయంగా మారాయి.

వరదనీటిలో హైదరాబాద్.. మూడు రోజులు బయటికి రావొద్దంటూ..

వరదనీటిలో హైదరాబాద్.. మూడు రోజులు బయటికి రావొద్దంటూ..

హైదరాబాద్ నగర రహదారులు, కాలనీల్లో వదర నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజుల వరకు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అత్యసవర సేవల కోసం ఫోన్ నెంబర్లు..

అత్యసవర సేవల కోసం ఫోన్ నెంబర్లు..

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అత్యవసర ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం 040-21111111, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ 90001 13667, 97046 01866, జీహెచ్ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ 94408 13750, ఎన్డీఆర్ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌కు దగ్గరలోనే తీవ్ర వాయుగుండం

హైదరాబాద్‌కు దగ్గరలోనే తీవ్ర వాయుగుండం


కాగా, హైదరాబాద్‌కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు.. భయంతో జనం..

మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు.. భయంతో జనం..

మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయంగా మారింది. దీంతో నగర జనం బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. పాతబస్తీలో ఇల్లు కూలి 9 మంది మృతి చెందారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుకోవడంతో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ట్రాఫిక్ స్తంభించి పోయింది. హుస్సేన్ సాగర్ నిండికుండలా మారిపోయింది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి.

Recommended Video

IPL 2020,SRH vs CSK : MS Dhoni's Chennai Super Kings Defeated Sunrisers Hyderabad By 20 Runs

English summary
heavy rains in hyderabad: GHMC alerts city people on floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X