హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాగ్య నగరానికి వానగండం.. అర్ధరాత్రి కుండపోత .. ప్రమాదకరస్థాయిలో హుస్సేన్ సాగర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ వాసులు వర్షాలు అంటే భయపడుతున్నారు. రహదారులు చెరువులను తలపిస్తుండడంతో ఎక్కడికైనా వెళ్లాలంటే నరకం చూస్తున్నారు. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, దిక్కుతోచని స్థితిలో జీవనం సాగిస్తున్నారు.
నిన్న అర్ధరాత్రి సమయంలో కురిసిన కుండపోత వర్షానికి మరోసారిహైదరాబాద్‌ అతలాకుతలం అయ్యింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే గురువారం ఉదయం నుంచి వర్షం పడలేదని నగరవాసులు కాసింత ఊపిరిపీల్చుకున్నారు. అంతలోనే నగరం నిద్రపోతున్నవేళ ఒక్కసారిగ కురిసిన కుంభవృష్టి వర్షం పలు లోతట్టుప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది.
గత రాత్రి 11. 30 నుంచి ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి ఏకధాటిగా కురిసిన వర్షపాతం చూస్తే అత్యధికంగా గుడిమల్కాపూర్ ప్రాంతంలో 14.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Heavy rains in Hyderabad ...Hussein Sagar at danger level

ఇక ఈ వర్షానికి మెహదీపట్నం, ఖైరతాబాద్, మోండా మార్కెట్,నాంపల్లి,బేగంబజార్, ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షానికి నగరంలో దాదాపు 100 బస్తీలు ముంపులో చిక్కుకున్నట్టు అంచానా వేస్తున్నారు అధికారులు. నగరంలో ప్రధాన కూడలిగా ఉన్న పంజాగుట్ట వద్ద వర్షపునీరు రహదారులను ముంచెత్తింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ఏర్పడింది. అదేవిధంగా మెహదీపట్నం, రాజేంద్రనగర్ మార్గంలో కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాదకరస్థాయిలో నిండిపోయింది. కాలనీల నుంచి కాల్వల ద్వారా వస్తున్న నీళ్లు సాగర్‌లోకి చేరుతుండడం..వర్షాలు పడుతుండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 512.10 మీటర్లుగా ఉంది. దీంతో నిన్ననే సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కానీ వర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం భాగ్యనగర్ వాసులకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్టు అని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన జిహెచ్ఎంసి సిబ్బంది వరద నీటిని క్లియర్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. కానీ వదలని వాన అటు అధికారులను, నగర వాసులను ముప్పతిప్పలు పెడుతుంది.

English summary
Hyderabad residents fear about rain. With the roads heading down the ponds, there is hell to go anywhere. The lowlands are inundated with rainfall and are living in disorientation.Hyderabad was once again the cause of the torrential rain that rained down at midnight yesterday. Many areas of the city were flooded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X