హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీ వర్షం.. చెరువులను తలపించిన రహదారులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వరుణుడు జోరందుకుంటున్నాడు. ఆ మేరకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, సనత్ నగర్, ఆబిడ్స్, నాంపల్లి, అమీర్ పేట, గచ్చిబౌలి, జీడిమెట్ల, ఎల్బీనగర్ తదితర ఏరియాల్లో వాన దంచికొట్టింది. వర్షపు నీరు ఏరులై పారడంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

వర్షపు నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూకట్‌పల్లితో పాటు నాచారం పరిధిలోని మల్లాపూర్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల హోర్డింగ్‌లు నేలకొరిగాయి. యూసుఫ్‌గూడలోని కృష్ణా నగర్‌ ప్రాంతంలోని పలు కాలనీల్లోకి వర్షపునీరు పోటెత్తడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది.

Heavy Rains In Hyderabad water flows on roads

ఉపాధి హమీ పథకంలో భేష్.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు అగ్రస్థానంఉపాధి హమీ పథకంలో భేష్.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు అగ్రస్థానం

గురువారం సాయంత్రం నుంచి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. కొన్ని ఏరియాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నెల 8వ తేదీన రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినా.. అనుకున్న సమయానికి వరుణుడు కరుణించలేదు. అనంతరం పలు తేదీలు ప్రకటించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరకు శుక్రవారం నాడు రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చాయి.

English summary
Heavy Rains In Hyderabad. The Rain Water flows on roads cause to traffic jam. Pedesterians and bike riders facing many problems with rain water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X