హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమె ఎత్తు 3.2, అతని ఎత్తు 5.4 అడుగులు ... ప్రేమించుకుని పరిణయమాడిన ఆదర్శ జంట

|
Google Oneindia TeluguNews

ఆమె ఎత్తు 3.2 అడుగులు, అతని ఎత్తు 5.4 అడుగులు... అయినా సరే వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరికోసం ఒకరు బ్రతకాలని నిర్ణయించుకున్నారు . ప్రేమకు శరీరంతో పనిలేదు. మనసుంటే చాలు అని నిరూపించారు. అందుకే ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రేమకు పేద ,ధనిక, కులం, వర్గం, వర్ణమే కాదు ఎత్తు తోనూ పనిలేదని నిరూపించిన జంట అంగరంగ వైభవంగా వివాహ వేడుకను జరుపుకుంది. తాను కోరుకున్న వరుణ్ణి పరిణయం ఆడుతున్న ఆనందంలో ఆ చిట్టి పొట్టి వధువు ఆనంద సాగరంలో మునిగి పోయింది.

ఎత్తుతో ఏం సంబంధం ... మనసుంటే చాలన్న కొత్త జంట

ఎత్తుతో ఏం సంబంధం ... మనసుంటే చాలన్న కొత్త జంట

ముషీరాబాద్ లోని హెరిటేజ్ ఫంక్షన్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా ఈ ఆదర్శ వివాహం జరిగింది. ఎత్తులో బోలెడంత తేడా ఉన్న వధూవరుల జంట ఒక్కటైంది. వారిద్దరి ఎత్తులో చాలా తేడా ఉన్నప్పటికీ, వారి మనసులో మాత్రం ఎలాంటి భేదం లేదు. ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటై ముచ్చట గొలిపారు . ఇంతకీ ఈ జంట ఎవరు అన్న వివరాల్లోకి వెళితే

ఆమె భూమికి జానా బెత్తెడే ..అయినా సరే ..ప్రేమించుకున్నారు .. పెళ్లి చేసుకున్నారు

ఆమె భూమికి జానా బెత్తెడే ..అయినా సరే ..ప్రేమించుకున్నారు .. పెళ్లి చేసుకున్నారు

వరుడు చిదురాల విద్యాసాగర్‌ (25)ది సిద్దిపేట వాసి. అతని తల్లిదండ్రులు చంద్రమౌళి, నాగమణి గతంలోనే మృతి చెందడంతో అక్క దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేశాడు. ఇక వధువు వీరవల్లి శ్రీనివాస్, పద్మ ల కుమార్తె.. రవళి (22). వీరిది సికింద్రాబాద్‌లోని మహంకాళి ప్రాంతం. రవళికి ఒక సోదరుడు ఉన్నాడు. అక్కాతమ్ముడు ఇద్దరూ ఎత్తు పెరగకుండా మరుగుజ్జులుగానే ఉండిపోయారు . రవళి ప్రస్తుతం అబిడ్స్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నీ సరిగా ఉన్నా ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళు ఉన్న నేటి రోజుల్లో భూమికి జానాబెత్తెడు అన్నట్టు ఉన్న రవళిని ప్రేమించి ఏకంగా పెళ్లి చేసుకున్నాడు విద్యాసాగర్ .

బుజ్జి పెళ్లి కూతురికోసం ఇల్లరికానికి ఒప్పుకున్న వరుడు

బుజ్జి పెళ్లి కూతురికోసం ఇల్లరికానికి ఒప్పుకున్న వరుడు

వరుడు ఎత్తు 5.4 అడుగులు, వధువు ఎత్తు 3.2 అడుగులు . అయినా సరే పెళ్లితో ఇద్దరు ఒకటవ్వాలని వధూవరులు నిర్ణయించుకున్నారు. దాంతో ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఒప్పుకున్నారు. ఇక చిట్టి పొట్టి వధువు కోసం ఇల్లరికం రావాలన్న కోరికను సైతం వరుడు ఒప్పుకోవడంతో గురువారం రాత్రి 8గంటలకు బంధుమిత్రుల సమక్షంలోవీరి పెళ్లి ఘనంగా జరిగింది. మొత్తానికి పెళ్ళికి వచ్చిన వారు ఈ పెళ్లి చూసి సంతోషించారు. బుజ్జి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు వేలు పట్టుకుని సిగ్గుల మొగ్గయింది.

English summary
Her height was 3.2 feet, his height was 5.4 feet ... but they both love each other . They decided to live together. Love does not work with the body the pair Vidyasagar and Ravali proved . The ideal marriage was performed at the Heritage Function Palace in Musheerabad. There is a couple of bride and groom who are different from altitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X