హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరో నాగార్జున ఫామ్‌హౌజ్ డెత్‌ కేసు: మిస్టరీని చేధించిన పోలీసులు.. తల్లి పేరు మీద లక్షలు

|
Google Oneindia TeluguNews

హీరో నాగార్జున ఫాం హౌజ్‌లో గుర్తు తెలియని శవం కలకలం రేపిన విషయం తెలిసిందే. శవానికి సంబంధించి పోలీసులు ఒక్కరోజులోనే మిస్టరీని చేధించారు. ఫామ్‌హౌజ్ ప్రాంతంలో ఉన్న పాపిరెడ్డి గూడెం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే

2016లోనే ఘటన

2016లోనే ఘటన

పోలీసుల కథనం ప్రకారం.. కుటుంబలోని తన సోదరుడు చనిపోవడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఫామ్‌హౌజ్‌లో హత్యహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. కాగా 2016లో ఆ సంఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. దీంతో శవం గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయింది.

పాండు కుటుంబం గురించి

పాండు కుటుంబం గురించి

వివరాల్లోకి వెళితే...పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన జంగమ్మ అంజయ్యల దంపతులకు మొత్తం నలుగురు కుమారులు. వీరిలో చిన్నకుమారుడైన పాండు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే మొత్తం నలుగురు కుమారుల్లో మృతి చెందిన పాండు తన అన్న కుమార్‌తో ఎక్కువగా చనువుగా ఉండేవాడు. ఇద్దరు అన్నదమ్ములు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా పెరిగారు. అయితే 2016లొ కుమార్ కిడ్ని సంబంధిత వ్యాధితో మృత్యువాత పడ్డాడు. దీంతో అన్న మృతిని పాండు తట్టుకోలేకపోయాడు. పాండు కూడ జీవితంపై విరక్తి పెంచుకున్నాడు.

ఆత్మహత్య గురించి ముందుగానే

ఆత్మహత్య గురించి ముందుగానే

ఈ నేపథ్యంలోనే తాను చనిపోతానని కుటుంబ సభ్యులు,స్నేహితులతో చెప్పాడు. కొద్ది రోజుల అనంతరం 2016 డిసెంబర్‌లో ఓ లెటర్ రాసి వెళ్లిపోయాడు. అయితే పాండు మిస్సింగ్ పై కుటుంబ సభ్యులు ఎలాంటీ అనుమానాలు వ్యక్తం చేయలేదు. పోలీసులకు ఫిర్యాదు కూడ చేయలేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు కూడ వెతక లేదు. దీంతో పాండు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

తల్లిపేరు మీద 19 లక్షలు

తల్లిపేరు మీద 19 లక్షలు

విశేషమేమిటంటే పాండు మరణానికి ముందు కుటంబపరమైన ఆస్తి అమ్మడం ద్వారా పాండు వాటాగా రూ.19 లక్షలు వచ్చాయి. వాటిని తల్లిపేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేయాలని, తాను చనిపోయాక తన ఫోటో కూడ అన్న కుమార్ ఫోటో పక్కన పెట్టాలని కుటుంబ సభ్యులకు సూచించాడు.

English summary
An unidentified body has been found in Hero Nagarjuna farmhouse. However, the mystery of the body was broken by the police within a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X