హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు.. హైకోర్టు నోటీసులు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. నోటీసులు జారీ చేసి ఇంకోసారి ఝలక్ ఇచ్చింది న్యాయస్థానం. తెలంగాణలో రవాణా వాహనాల వేగం నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ది రైట్ సొసైటీ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ మేరకు పిటిషనర్ తరపు లాయర్ రచనా రెడ్డి కోర్టు దృష్టికి పలు అంశాలను తీసుకొచ్చారు.

రవాణా వాహనాల మితిమీరిన వేగానికి కళ్లెం వేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు రచనా రెడ్డి. వాస్తవానికి రవాణా వాహనాల స్పీడ్ కారణంగానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయనే విషయం కేంద్రం రిలీజ్ చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయనే విషయం కోర్టుకు వివరించారు.

high court notices to telangana govt once more

కరెంట్ లొల్లి : రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై గరం గరం.. ఉద్యోగులా, రౌడీలా అంటూ మరో కోణం ..!కరెంట్ లొల్లి : రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై గరం గరం.. ఉద్యోగులా, రౌడీలా అంటూ మరో కోణం ..!

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు వివరించారు.

రవాణ వాహనాల స్పీడ్ కు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన రాధాకృష్ణన్‌ కమిటీ, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వేగ నియంత్రణ వ్యవస్థను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కోర్టుకు విన్నవించారు.

తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదని న్యాయవాది రచనా రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. తెలంగాణలో రవాణా వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదన్న పిటిషనర్ ఆరోపణలపై.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది.

English summary
Telangana Govt. Notices were issued by the High Court once more. The High Court is hearing a public interest litigation filed by The Right Society, alleging that no action is being taken to regulate the speed of transport vehicles in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X