హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్ నుంచి పేర్లు, ఫోటోలు.. పోర్న్ వెబ్‌సైట్లపై హైకోర్టు సీరియస్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : పోర్న్ వెబ్‌సైట్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఆ క్రమంలో గూగుల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. పోర్న్ వెబ్‌సైట్లకు సంబంధించి పూర్తి వివరాలు న్యాయస్థానంలో సమర్పించాలని ఆదేశించింది. పోర్న్ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌పై మంగళవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ క్రమంలో అశ్లీల పోర్న్ వెబ్‌సైట్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోషల్ మీడియా వేదికైన ఫేస్‌బుక్ నుంచి కొందరి పేర్లు, ఫోటోలు సేకరించి వాటిని పోర్న్ పోర్న్ వెబ్‌సైట్లలో పెడుతున్నారని ఆరోపిస్తూ ఓ యువతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్‌పై మంగళవారం నాడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ యువతి చెప్పిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

<strong>సీఎం కేసీఆర్ ఇలాకాలో మరో షాక్.. మల్లన్న సాగర్ కేసులో హైకోర్టు ఝలక్.. మరో ఇద్దరికి జైలు శిక్ష!</strong>సీఎం కేసీఆర్ ఇలాకాలో మరో షాక్.. మల్లన్న సాగర్ కేసులో హైకోర్టు ఝలక్.. మరో ఇద్దరికి జైలు శిక్ష!

high court of telangana serious on porn websites

ఆ క్రమంలో తన పేరుతో పాటు తనకు సంబంధించిన ఫోటోలు పోర్న్ సైట్లలో దర్శనమివ్వడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ యువతి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయం గూగుల్ సంస్థకు గతంలో ఫిర్యాదు చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు. తన పేరు, ఫోటోలను డిలేట్ చేయాల్సిందిగా కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేదని చెప్పుకొచ్చారు.

గూగుల్ సంస్థ రెస్పాండ్ కాకపోయేసరికి హైకోర్టు మెట్లెక్కారు ఆ యువతి. ఆమె పిటిషన్‌పై విచారించిన హైకోర్టు పోర్న్ వెబ్‌సైట్లపై సీరియస్ అయింది.పోర్న్ వెబ్‌సైట్లు రూపొందిస్తున్నవారి పట్ల గూగుల్ సంస్థ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. అలాంటి వెబ్‌సైట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో అశ్లీల వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేయాల్సిందిగా గూగుల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా వేస్తూ పోర్న్ వెబ్‌సైట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

English summary
The High Court has become serious on porn websites. High Court issued notices to Google company. The court has ordered the full details of porn websites to be submitted in court. The High Court on Tuesday held a hearing on the petition for action on porn websites. The High Court is outraged that pornographic websites are being partly misused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X