హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి అందిన హైకోర్టు ఆర్డర్ కాపీ: సీఎం కేసీఆర్ స్పందన ఏమిటో?

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై ఇప్పటికే విచారణ జరిపిన ప్రభుత్వం సమ్మె విషయంలో తన ఆదేశాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ పంపించిన హైకోర్టు ఆర్డర్ కాపీ మంగళవారం ప్రభుత్వానికి చేరింది. కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆర్టీసీ కార్మిక జే.ఏ.సి తమ సమస్యలు పరిష్కరించని, చర్చలకు పిలవని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే నేడు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల కాపీ ప్రభుత్వానికి చేరింది. దీంతో ఆర్డర్ కాపీ లో ఉన్న విషయం ఏంటి? అందులో సాధ్యాసాధ్యాలు ఏమిటి అన్న దానిపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు.

ఆర్టీసీ సమ్మె పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ కాపీ జారీ చేయడంతో భవిష్యత్ కార్యాచరణ చర్చించేందుకు మంత్రి పువ్వాడ అజయ్, అధికారులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. హైకోర్టు కాపీని పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలు జరుపుతారని తెలుస్తోంది . తదుపరి చర్యలపై అటు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.
హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన విషయం సీఎంవో అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన హైకోర్టు ఇచ్చిన కాపీపై అధ్యయనం చేసి,కోర్టు ఆ ఆర్డర్ కాపీలో ఏమిచ్చింది. సాధ్యసాధ్యాలపై మొత్తం అధికారులతో చర్చించి నివేదిక తయారు చేయాలని మాజీ సీఎస్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను ఆదేశించారు.

 High Court order Copy received by the government on RTC strike ... What is the response of CM KCR?

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మంత్రి పువ్వాడ, ముఖ్య అధికారులతో రాజీవ్ శర్మ ప్రగతి భవన్‌లో ప్రస్తుతం ఆర్డర్ కాపీ లోని అంశాలపై సమీక్షిస్తున్నారు. దీని తర్వాత వారు నివేదిక తయారు చేసి సీఎం కేసీఆర్ కు అందించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక సీఎం కేసీఆర్ ఈ సాయంత్రం 3 గంటలకు కోర్టు తీర్పు, ఇతర అన్ని అంశాలపై చర్చించి ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో, ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

దీంతో కార్యాచరణపై చర్చించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అధికారులు ప్రగతి భవన్‌ లో కోర్టు ఆదేశాలపై కుస్తీ పడుతున్నారు. హైకోర్టు కాపీని పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలు జరుపుతారని అంటున్నారు. ఏదేమైనప్పటికీ హై కోర్ట్ ఆర్డర్ కాపీ అందిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతారా, లేక ఏం చేస్తారు అన్న అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

English summary
A copy of the High Court order sent to the government on Tuesday in the matter of the strike has already reached the government. RTC labor JAC is outraged that the government is delaying the receipt of a court order. Against this backdrop, a copy of the High Court order on the RTC strike has reached the government today. What is the content of the order copy? CM KCR focused on the possibilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X