హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం: కోర్టు పరిధి దాటి ఆదేశాలు ఇవ్వలేము: ఎస్మా పైనా...ఇలా..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం అడిగి బుధవారంలోగా చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని హైకోర్టు ప్రశ్నించింది. చర్చలు జరపాలని ఏ ప్రాతిపదికన ఆదేశించగలమని కోర్టు పేర్కొంది. కోర్టు చట్టానికి అతీతం కాదు, పరిధి దాటి వ్యవహరించలేం..చర్చలు జరపాలని ప్రభుత్వం లేదా ఆర్టీసీని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ కోర్టులో పెండింగ్ లో ఉండటం వలన తదుపరి చర్యలు చేపట్టలేకపోయినట్లు అడ్వకేట్‌ జనరల్‌ నివేదించారు. దీంతో..విచారణ బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.

12వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష: నేతల ఇళ్ల ముట్టడికి పిలుపు: ఆర్టీసీ జేఏసీ నిర్ణయం..!12వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష: నేతల ఇళ్ల ముట్టడికి పిలుపు: ఆర్టీసీ జేఏసీ నిర్ణయం..!

ముగ్గురు సుప్రీం మాజీ న్యాయమూర్తులతో..
తెలంగాణ ప్రభుత్వం..ఆర్టీసీ కార్మికుల మధ్య తెగని వివాదం పరిష్కరానికి హైకోర్టు కొత్త ప్రతిపాదన చేసింది. అందులో భాగంగా.. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం అడిగి బుధవారంలోగా చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. అదే సమయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని హైకోర్టు ప్రశ్నించింది. చర్చలు జరపాలని ఏ ప్రాతిపదికన ఆదేశించగలమని కోర్టు పేర్కొంది. కోర్టు చట్టానికి అతీతం కాదు, పరిధి దాటి వ్యవహరించలేం..చర్చలు జరపాలని ప్రభుత్వం లేదా ఆర్టీసీని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సందర్భంగా.. సమ్మె చట్టవిరుద్ధం అని ఆదేశించడానికి కోర్టుకు ఉన్న పరిధి, అధికారాల గురించి సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ తన వాదనలు వినిపించారు. గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు... కాబట్టి ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై కూడా ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

High court proposed to appoint Three retired supreme court judges to resolve TSRTC strike

కోర్టు పరిధి దాటి మేము..
హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున తదుపరి చర్యలు చేపట్టలేకపోయినట్లు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు నివేదించారు. ఇదే విచారణలో భాగంగా.. కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మరికొంత మంది ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. మరికొంత మంది చర్చలకు పిలిచేలా ఆదేశాలు ఇవ్వమంటున్నారు. అసలు ఈ అంశం కోర్టు పరిధిలో ఉందో.. లేదో చెప్పట్లేదు. కోర్టు పరిధి దాటి మేము ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక, ఎస్మా మీద కోర్టులో వాదనలు సాగాయి. గతంలో ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు..ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీపై కూడా ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని విద్యాసాగర్‌ కోరారు. ఏపీఎస్‌ ఆర్టీసీపై ప్రయోగించిన ఎస్మా టీఎస్‌ఆర్టీసీపై ఎలా వర్తిస్తుందని హైకోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్ స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు వర్తిస్తాయా అని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె లీగలా.. ఇల్లీగలా అనేది నిర్ణయించడం తమ పరిధిలో లేదని కోర్టు పేర్కొంది.

English summary
High court proposed to appoint Three retired supreme court judges re resolve TSRTC strike dispute. Given on day time for govt opinion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X