హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త వాహనాలకు ఇకపై "హై సెక్యూరిటీ" - "లో క్వాలిటీ" నంబర్ ప్లేట్ తప్పనిసరి ... !

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించుకోవాలని రవాణాశాఖ ఎంతచెప్పినా.. వాహనదారుల్లో అవగాహన లేకుండా పోతోంది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరంటూ ప్రభుత్వం చెప్పినా కూడా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకే వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించేలా రవాణా శాఖ కొత్త పంథా ఎన్నుకుంది. వాహనదారులు వాటిపై ఆసక్తి కనబరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై షోరూమ్ నుంచి బయటకొచ్చే ప్రతి వాహనానికి ఈ నెంబర్ ప్లేట్ బిగించాల్సిందే.

బండి బయటకొస్తే.. విత్ నెంబర్ రావాల్సిందే

బండి బయటకొస్తే.. విత్ నెంబర్ రావాల్సిందే

హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల బిగింపునకు రవాణా శాఖ అధికారులు కొత్త స్కెచ్ వేశారు. ఇకపై షోరూముల్లోనే నెంబర్ ప్లేట్లు బిగించేలా ఆదేశాలు జారీచేశారు. వాహనాలకు సంబంధించిన టెక్నికల్ వివరాలతో పాటు వాహన యజమానుల వివరాలు పొందుపరిచేలా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటుచేసుకోవాలని ఇదివరకే షోరూమ్ నిర్వాహకులను ఆదేశించారు. అదే క్రమంలో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విషయంలోనూ అదే పద్దతి పాటించాలని సూచించారు. దీంతో షోరూముల్లోనే వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించాల్సి ఉంటుంది.

పైసలు కడుతున్నా.. ప్లేట్లు మాత్రం సున్నా

పైసలు కడుతున్నా.. ప్లేట్లు మాత్రం సున్నా

కొన్ని నేరాల విషయంలో వాహనాల నెంబర్లతో దర్యాప్తు చేస్తుంటారు పోలీసులు. అయితే నేరాలు చేయడంలో ముదిరిన నేరగాళ్లు నెంబర్ ప్లేట్లు మార్చుతూ పోలీసుల కన్నుగప్పుతున్నారు. ఒకే నెంబర్ తో చాలా వాహనాలు ఉండటం, చోరీ చేసిన బండ్లతో నేరాలు చేయడం తదితర కేసులు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. దీంతో బండ్లకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేసింది గవర్నమెంట్.

కొత్త వాహనాలకు బిగిస్తున్న ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ అయిపోయాక కొన్నిరోజులకు నెంబర్ ప్లేట్ సిద్ధమంటూ వాహనదారులకు మేసేజ్ వస్తుంది. అప్పుడు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లి నెంబర్ ప్లేట్లు బిగించుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు ఆర్టీవో ఆఫీసులకు వెళ్లి.. ఆ నెంబర్ ప్లేట్లు బిగించుకోవడానికి అంత పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

 పేరుకే

పేరుకే "హై సెక్యూరిటీ".. అంతా "లో క్వాలిటీ"

హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తెరపైకి వచ్చినప్పటి నుంచి వివాదస్పదంగానే ఉంది వ్యవహారం. చాలా పలుచగా ఉండటం, నాణ్యతా లోపం కారణంగా వాహనదారులు ఈ నెంబర్ ప్లేట్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. హై సెక్యూరిటీ అని గొప్పగా చెబుతున్నా.. అంతా లో క్వాలీటీయే అనే ఆరోపలున్నాయి. అదలావుంటే ఇవి అంత ఆకర్షణీయంగా లేవనేది మరో కోణం. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే వీటికి డబ్బులు కడుతున్నా.. తీసుకోవడానికి మాత్రం వాహనదారులు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్టీఎ కార్యాలయాల్లో పెద్దసంఖ్యలో నెంబర్ ప్లేట్లు మూలనపడుతున్నాయి.

హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు 'లో క్వాలిటీ' తో ఉండటంతో త్వరగానే చెడిపోతున్నాయి. మళ్లీ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు కావాలని అడిగితే పోలీసుల నుంచి FIR కాపీ తీసుకురావాల్సి ఉంటుంది. దీంతో ఎందుకులే మనకు తలనొప్పి అనుకుంటూ చాలామంది నార్మల్ నెంబర్ ప్లేట్లు బిగించుకుంటున్నారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేకుంటే ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తారు. అయినా కూడా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఫైన్లు కడుతున్నారే తప్ప మరోసారి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.

English summary
The high security number plates are must for all vehicles, can not be avoided. No one is interested in the government despite the high security number plates. That is why the Department of Transportation has taken a new line to hike the high security number plates for vehicles. The number plate for each vehicle coming out of the showroom is to be fixed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X