హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు..!? మరోసారి ఈసీకి ప్రతిపాదనలు పంపిన హోంశాఖ

|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టుసాధించేందుకు అసెంబ్లీ సీట్ల పెంపుదలనే మార్గంగా బీజేపీ భావిస్తుందా... ఇన్ని రోజులు రెండు రాష్ట్రాల సీఎం అడిగినా పట్టించుకొని కేంద్రం ఇప్పుడు పావులు కదుపుతుందా.... ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ద్వితియ శ్రేణి నాయకత్వాన్ని చేరదీస్తున్న బీజేపీ, వాళ్లను అక్కున చేర్చుకునేందుకు అసెంబ్లీ సీట్ల పెంపుకు రంగం చేస్తున్నట్టు తెలుస్తోంది.

రాజకీయంగా బలపడేందుకు సీట్ల పెంపే శరణ్యం...

రాజకీయంగా బలపడేందుకు సీట్ల పెంపే శరణ్యం...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడ రాజకీయ నిరుద్యోగులు పెరిగిపోయారు. దీనికి తోడు తెలంగాణలో ఉన్న పార్టీ నేతలందరు టీఆర్ఎస్‌లోకి చేరిపోయారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఇదే పరిస్ధితి నెలకోంది. ఊహించని విజయాన్ని వైసీపీ సాధించడంతో ఉన్న నేతలంతా ఆ పార్టీలోకి జంప్ అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల నేతలు కూడ అసెంబ్లీ సీట్లను పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొంత ప్రాసెస్ కూడ జరిగింది.

అసెంబ్లీ సీట్ల పెంపు తర్వాతే అన్ని పార్టీలకు అవకాశం

అసెంబ్లీ సీట్ల పెంపు తర్వాతే అన్ని పార్టీలకు అవకాశం

అయితే ఈ పరిస్థితిని కేంద్రం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దక్షిణాదిలో పాగ వేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కీలకంగా మారడంతో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఇక రెండు రాష్ట్రాలతోపాటు జమ్ము కశ్మీర్, సిక్కిం రాష్ట్రాల్లో కూడ సీట్లను పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభన బిల్లును గట్టేంచిందేకు ఓ కమీషన్ కూడ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.

టార్గెట్ జమ్ము ,కశ్మీర్...

టార్గెట్ జమ్ము ,కశ్మీర్...


ముఖ్యంగా రానున్న ఆరు నెలల్లో కశ్మీర్ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ముందుగా కశ్మీర్‌‌లో పాగ వేయాలంటే అక్కడ అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన ఒక్కటే మార్గం బీజేపీకి బలం ఉన్న జమ్ము ప్రాంతంలో కొద్ది సీట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో కశ్మీర్‌పై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మరో ఆరు నెలల పాటు గవర్నర్ పాలను పోడగిస్తూ ఇటివలే పార్లమెంట్‌లో నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌తో పాటే పునర్‌ విభజన హామీలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ సీట్ల పెంపు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమచారం. ఇక పునర్విభజన అయినట్టయితే తెలంగాణలో 151, ఆంధ్రప్రదేశ్‌లో 225 స్థానాలకు చేరుకోనున్నాయి.

English summary
once again assembly seats increasing issue is arise.central governament moving the process of the assembly seats increas in the telugu states, along with kashmir and sikkim.center going to clear this by next parlament sitting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X