• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హేమంత్ హత్య : ఆ ఇద్దరితో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్న పోలీసులు.. సజ్జనార్ పాదాలను తాకిన అవంతి...

|

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్య కేసుకు సంబంధించి బుధవారం(సెప్టెంబర్ 30) అవంతి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. అనుమానిత వ్యక్తులు తమ రాకపోకలపై నిఘా పెట్టి రెక్కీ నిర్వహిస్తున్నట్లు అవంతి ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే హేమంత్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. హేమంత్ హత్య తర్వాతి పరిణామాలను సీపీ సజ్జనార్‌కు వివరించారు. ఈ సందర్భంగా అవంతి సీపీ పాదాలను తాకి నమస్కారం చేయడం గమనార్హం.

  Hyderabad-Bengaluru Industrial Corridor To Connect AP ఏపీలోని ప్రాంతాలకు కూడా సముచిత స్ధానం...!!
  ఇంటి వద్ద 24 గంటల భద్రత...

  ఇంటి వద్ద 24 గంటల భద్రత...

  అవంతి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీపీ... చందానగర్‌లోని హేమంత్ నివాసం వద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ను అక్కడ విధుల్లో పెట్టాలని ఆదేశించారు. కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అవంతితో చెప్పారు. కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమని,నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామని సజ్జనార్ హేమంత్ కుటుంబానికి హామీ ఇచ్చారు.

  సీన్ రీకన్‌స్ట్రక్షన్...

  సీన్ రీకన్‌స్ట్రక్షన్...

  మరోవైపు కేసులో నిందితులైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆరు రోజుల పాటు ఈ ఇద్దరినీ విచారించనున్నారు. హేమంత్‌ను కిడ్నాప్ చేసిన గోపన్ పల్లి నుంచి సంగారెడ్డిలో హత్యా స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ ‌చేయనున్నారు. హత్య వెనుక ప్రధాన సూత్రధారి లక్ష్మారెడ్డి,హత్యను అమలుపరిచింది యుగంధర్ రెడ్డి అని పోలీసులు ఇప్పటికే నిర్దారించారు.

  లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కూడా పికెటింగ్...

  లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కూడా పికెటింగ్...

  మరోవైపు చందానగర్‌లోని లక్ష్మారెడ్డి ఇంటికి కూడా పోలీసులు 24గంటలు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఈ కేసులో 21 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. మంగళవారం(సెప్టెంబర్ 29) హేమంత్ భార్య అవంతితో పాటు తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని గచ్చిబౌలి పోలీసులు నమోదు చేశారు. ఉదయం 11గం. నుంచి సాయంత్రం 4గం. వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన అవంతి హేమంత్ హత్య కేసులో తమకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

  ఇలా హేమంత్ హత్య...

  ఇలా హేమంత్ హత్య...

  గత గురువారం(సెప్టెంబర్ 24) హేమంత్-అవంతిల ఇంటికెళ్లిన లక్ష్మారెడ్డి అతని ఫ్యామిలీ మాట్లాడుకుందామని చెప్పి వారిని కారులో ఎక్కించుకున్నారు. అయితే కారు చందానగర్‌లోని ఇంటి వైపు కాకుండా ఓఆర్ఆర్ వైపు తిరగడంతో హేమంత్,అవంతిలకు అనుమానం కలిగింది. గోపన్ పల్లి సమీపంలో కారు నుంచి కిందకు దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అవంతి తప్పించుకోగా... హేమంత్‌ను కిరాయి మనుషులు కొట్టుకుంటూ తీసుకెళ్లి మళ్లీ కారులో ఎక్కించారు. అనంతరం జహీరాబాద్ వైపు వెళ్లి... అక్కడ ఓ తాడు కొన్నారు. కారులోనే హేమంత్ గొంతును తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆపై సంగారెడ్డి సమీపంలో రహదారి పక్కన మృతదేహాన్ని పడేసి పారిపోయారు. అవంతి హేమంత్‌ను కులాంతరం వివాహం చేసుకోవడంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.

  English summary
  Cyberabad CP Sajjanar ordered Chandanagar police for 24 hours picket at Hemanth's resident,after Avanthi met him on Wednesday,Sajjanar issued this order.Sajjanar said he wrote a letter to government to establish a fast track court to investigate this case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X