హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యేడాదిలోపే ఇచ్చిన హామీ మర్చిపోతే ఎలా.? ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా జగన్ ను నిలదీసిన మోత్కుపల్లి..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బీజేపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీలకతీతంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపితో గాని, తెలుగుదేశం పార్టీతో గానీ, ఏపీ రాజకీయాలతో గాని మోత్కుపల్లి నర్సింహులుకు ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికి ఆయన ఏపీ రాజకీయాల గురించి స్పందించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన మోత్కుపల్లి భావోద్వేగానికి లోనయ్యారు. సర్గీయ ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకున్న మోత్కుపల్లి, ఎన్టీఆర్ యుగపురుషుడని అభివర్ణించారు. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారియి.

ఏపి సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నిచిన మోత్కుపల్లి.. ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరెందుకు పెట్టలేదన్న బీజేపి నేత..

ఏపి సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నిచిన మోత్కుపల్లి.. ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరెందుకు పెట్టలేదన్న బీజేపి నేత..

స్వర్గియ ఎన్టీఆర్ 97వ జయంతి సందర్బంగా మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీసారు. పాదయాత్రలోనే కాకుండా ఎన్నికల ప్రచారం సందర్బంగా క్రిష్ణ జిల్లా గుడివాడలో జగన్ చేసిన ప్రసంగాన్ని మోత్కుపల్లి గుర్తు చేసారు. అంతే కాకుండా మాట తప్పనని, మడమ తిప్పనని, సంక్షేమ పథకాల అమలులో తన తండ్రి ఒకడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు వేస్తానని చెప్పుకున్న జగన్ ప్రస్తుతం ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల హామీల పట్ల జగన్ ఏమరు పాటుగా ఉన్నా ప్రజలకు అన్నీ గుర్తుంటాయని మోత్కుపల్లి నర్పింహులు గుర్తుచేసారు.

గెలిస్తే ఒకరకంగా, గెలవక ముందు మరోరకంగా ఉండకూడదు.. జగన్ కు హితవు పలికిన మోత్కుపల్లి..

గెలిస్తే ఒకరకంగా, గెలవక ముందు మరోరకంగా ఉండకూడదు.. జగన్ కు హితవు పలికిన మోత్కుపల్లి..

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపి తరుపును జగన్ ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేసారో ఆత్మవిమర్శ చేసుకోవాలని మోత్కుపల్లి సూచించారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పటి జగన్ కు, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని అబిప్రాయపడ్డారు. జిల్లాల వారిగా ఎలాంటి హామీలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు. అధికారంలో లేనప్పుడు ఒకరకంగా, అధికారంలోకి రాగానే మరో రకంగా మారిపోకూడదని సూచించారు. ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని మోత్కుపల్లి పేర్కొన్నారు. అంతే కాకుండా క్రిష్ణా జిల్లా అంశంలో జగన్ తప్పు చేస్తున్నారని మోత్కుపల్లి సూటిగా ప్రశ్నించారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీని గుర్తు చేసుకో... ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేసిన మోత్కుపల్లి..

పాదయాత్రలో ఇచ్చిన హామీని గుర్తు చేసుకో... ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేసిన మోత్కుపల్లి..

జగన్ పాదయాత్రకు ముందు, పాద యాత్ర తర్వాత ఎన్నికల ప్రాచారంలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తానని జగన్ వాగ్దానం చేసారని, కాని ఏడాది కాలంగా మాట మారుస్తున్నారని అన్నారు. అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఒక జిల్లా పేరు మార్చడం పెద్ద కష్టమైన పని కాదని, గతంలో కడప జిల్లాకు వైయస్సార్ కడప జిల్లాగా మార్చలేదా అని మోత్కుపల్లి ప్రశ్నంచారు. ఇప్పటికైనా క్రిష్ణ జిల్లాకు స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరును ఖరారు చేసి జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్దిని చాటుకోవాలని సూచించారు.

Recommended Video

AP Govt Extends Build AP E-auction For 15 Days
ఎన్టీఆర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి.. కేసీఆర్ కు సూచించిన మోత్కుపల్లి నర్సింహులు..

ఎన్టీఆర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి.. కేసీఆర్ కు సూచించిన మోత్కుపల్లి నర్సింహులు..

అంతే కాకుండా ఇచ్చిన హామీల పట్ల, ప్రజల ఆకాంక్షల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. సుధాకర్ అనే డాక్టర్ విషయంలో ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని, గెలిచే ముందు ప్రజల మనిషిగా ఉండి, గెలిచిన తర్వాత బడుగు బలహీన వర్గాలను అవమాన పరచడం ఏపి సీఎంకు సరికాదన్నారు మోత్కుపల్లి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో కూడా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎందుకు అధికారికంగా నిర్వమించడంలేదని, సర్గీయ ఎన్టీఆర్ చొవరతోనే చంద్రశేఖర్ రావు లాంటి వాళ్లు రాజకీయంగా ఎదిగారన్న విషయాన్ని మర్చిపోకూడదని మోత్కుపల్లి హితవు పలికారు.

English summary
BJP senior leader Mothkupalli Narsimhalu responded to the parties. Mothkupalli has expressed outrage over Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X