హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొంపముంచిన కల్ట్ ఫిట్... హృతిక్ రోషన్‌‍పై హైదరాబాద్ పోలీసుల కేసు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

KPHB Police Registered Cheating Case On Actor Hrithik Roshan || Filmibeat Telugu

హైదరాబాద్ : బిజీ లైఫ్ స్టైల్.. వర్క్ టెన్షన్.. మనిషి శారీరకంగానే కాదు.. మానసికంగానూ అనారోగ్యం పాలవుతున్నాడు. రకరకాల రోగాల బారిన పడుతున్నారు. ఇది గ్రహించిన చాలా మంది ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు ఫిట్‌నెస్ బిజినెస్‌లో ఎంటరై కోట్లు ఆర్జిస్తున్నారు. సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ప్యాకేజీలతో ఆకట్టుకుని ఆ తర్వాత జనానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి ఓ ఫిట్‌నెస్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్ హీరో చిక్కుల్లో పడ్డారు.

యాప్ ద్వారా సెషన్ బుకింగ్

యాప్ ద్వారా సెషన్ బుకింగ్

కల్ట్ ఫిట్.. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ఫిట్‌నెట్ సెంటర్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దేశవ్యాప్తంగా సెంటర్లు ఏర్పాటు చేసిన ఈ కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్‌ను నియమించుకుంది. వివిధ రకాల ప్యాకేజీలతో ఆకట్టుకునే ఆఫర్లు ఇవ్వడంతో కల్ట్‌ఫిట్‌లో జాయిన్ అయ్యేందుకు చాలా మంది మొగ్గుచూపారు. కస్టమర్లు యాప్ ద్వారా సెషన్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అవడం.. హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్‌ కావడంతో చాలా మంది జాయిన్ అయ్యారు. ఇదే అదునుగా కంపెనీ సామర్థ్యానికి మించి కస్టమర్లను చేర్చుకుంది.

స్లాట్లు దొరకక ఇబ్బందులు

స్లాట్లు దొరకక ఇబ్బందులు

దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కల్ట్ ఫిట్ హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్ 3లో సెంటర్ ఏర్పాటు చేసింది. వెయిట్‌లాస్, ఫిట్ నెస్, యోగా తదితర సెషన్ల కోసం ఏడాదికి రూ.17,490 నుంచి 36వేల ఫీజుతో ప్యాకేజీలు ప్రకటించడంతో చాలా మంది మెంబర్‌షిప్ తీసుకున్నారు. అయితే పరిమితికి మించి సభ్యులు చేరడంతో స్లాట్ దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కంపెనీ మాత్రం స్పందించలేదు.

విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు

విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు

స్లాట్ దొరకక ఇబ్బందులు పడుతున్న కస్టమర్లు కల్ట్‌ఫిట్ నిర్వాహకులను నిలదీశారు. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో శశికాంత్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వేలకు వేలు ఫీజులు కట్టించుకుని స్లాట్స్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. కల్ట్ ఫిట్ నిర్వాహకులతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న హృతిక్ రోషన్‌పై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో పోలీసులు హృతిక్ రోషన్‌తో పాటు కల్ట్ ఫిట్ డైరెక్టర్ ముకేశ్ బాంచల్, సీఈఓ అంకిత్, మేనేజర్ సుబ్రమణ్యంపై ఐపీసీ సెక్షన్ 420, 406 కింద కేసు నమోదుచేశారు.

English summary
Hyderabad Police registered a case of cheating against Bollywood actor Hrithik Roshan, brand ambassador of Cult.Fit and three others on a complaint filed by a gym user.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X