హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

10 నెలలుగా షాప్ క్లోజ్.. తీసి చూస్తే పుర్రె, అస్థిపంజరం లభ్యం.. ఎక్కడ అంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా వల్ల వ్యాపార/ వాణిజ్య సముదాయాలు తొలినాళ్లలో మూసివేశారు. తర్వాత దాదాపు అన్నింటినీ తెరిచారు. కానీ హైదరాబాద్ నడిబొడ్డున ఓ షాపు మాత్రం ఓపెన్ చేయలేదు. అలా అని రెంట్ కూడా కట్టడం లేదు. దీంతో యాజమానులు అయినా ప్రార్థనా మందిరం నిర్వహకులు ధైర్యం చేసి ఓపెన్ చేశారు. అయితే అందులో ఓ బాక్స్ కనిపించింది. అందులో చూస్తే పుర్రె, ఎముకలు బయటపడ్డాయి.

ప్రార్థన మందిరానికి చెందిన షాపును అద్దెకు ఇచ్చారు. లాక్ డౌన్ కన్నా ముందే వ్యాపారం సజావుగా సాగేది. కానీ తర్వాత మూసివేశారు. ఓపెన్ చేయాల్సి వచ్చినా.. సరయిన మార్కెట్ లేదు. దీంతో 10 నెలల నుంచి క్లోజ్ చేసి ఉంది. అలా ఉన్నా కిరాయి కూడా ఇవ్వడం లేదు. చూసి.. చూసి వారు అలసిపోయారు. ఇంకేముంది ఓపెన్ చేయగా.. అస్థిపంజరం బయటపడింది.

Human Skeletal Remains Found in Wooden Box at Furniture Store

దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. ప్రార్థన మందిరానికి చెందిన షాపు నిర్వహకులను ప్రశ్నించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే.. అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆ అస్థిపంజరం ఎవరిదో తెలియదని.. విచారణలో తెలిసే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

English summary
Human skeletal remains were found wooden box at a furniture store here at hyderabad, which remained closed for almost a year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X