హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అదే కారణమా! అసత్య ప్రచారమంటూ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు హికా కారణమా? అసలు హికా తుపానుతో ఏపీ, తెలంగాణలో పడుతున్న వానలకు సంబంధం ఉందా? హికా కారణంగా వానలు పడుతున్నాయనే ప్రచారం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు కాదు అనే సమాధానం వస్తోంది. అయితే కొందరు పని గట్టుకుని పీక్ స్టేజీలో ప్రచారం చేస్తుండటంతో ఇప్పటి వర్షాలకు హికా కారణమని భావిస్తున్నారు చాలామంది. అయితే ఇప్పటి వానలకు హికా తుపానుతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.

Recommended Video

Hyderabad Heavy Rains Exclusive Videos
ఇప్పటి వర్షాలకు హికా కారణం కాదా?

ఇప్పటి వర్షాలకు హికా కారణం కాదా?

అరేబియా సముద్రంలో సంభవించిన హికా తుపాను ఒమన్ దేశంలో తీరం దాటి వాయుగుండంగా బలహీనపడింది. అయితే ఈ నేపథ్యంలో అది ఏపీ మీదుగా దూసుకు వచ్చిందని.. దాని కారణంగానే వర్షాలు కురుస్తున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ట్రాష్‌గా తేలిపోయింది. అలాంటిదేమీ లేదని.. అది అసత్య ప్రచారమని డిక్లేర్ అయింది.

అదంతా అసత్య ప్రచారమేనా?

అదంతా అసత్య ప్రచారమేనా?

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు హికా తుపాను కారణమనే ప్రచారం జోరందుకుంది. కొందరు నెటిజన్లు అదే పనిగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో పడుతున్న వానలకు హికా తుపాను కారణం కాదని స్పష్టమైంది. ఉపరితల ఆవర్తనానికి కొన్ని రకాల గాలులు తోడై బలమైన రుతు పవనాలు వ్యాపించడంతో కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నట్లు సమాచారం.

హికా తుపాను ప్రభావం సంగతేంటి?

హికా తుపాను ప్రభావం సంగతేంటి?

ఇప్పటివరకు హికా తుపాను ప్రభావం కనిపించకపోయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలను అది కలవరపెడుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హికా తుపాను బీభత్సం సృష్టించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అంతేకాదు మరో 15 రాష్ట్రాలకు కూడా హికా తుపాను గండం పొంచి ఉన్నట్లు తెలిపారు. హికా తుపాను కారణంగా అరేబియా సముద్ర తీరంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

ఎక్కడెక్కడ దాని ప్రభావమంటే..?

ఎక్కడెక్కడ దాని ప్రభావమంటే..?

అదలావుంటే మరో 48 గంటల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్, విదర్భ, పశ్చిమబెంగాల్‌లో కుంభవృష్టి వాన పడే ఛాన్సుందన్నారు. ఇక మహారాష్ట్ర, గోవా, మేఘాలయ, అసోం తదితర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మరోవైపు జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలున్నట్లు స్పష్టం చేశారు వాతావరణ శాఖ అధికారులు.

English summary
Is Hika cause for the rains in Telugu states? Does the Hika Storm have anything to do with the rains of AP and Telangana? To what extent is the publicity of Hika being advertised? The answer is no such questions. However, due to the fact that some people are working and promoting the Peak Stage. However, the current vans have nothing to do with the Hikka Storm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X