హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆలుమగల గొడవ, పెట్రోల్ పోసుకున్న భర్త, 60 శాతం గాయాలతో..

|
Google Oneindia TeluguNews

ఆలుమగల మధ్య మొదలైన గొడవ.. ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. భార్య అలిగి వెళ్లడం.. ఇంటికి రావాలని కోరినా.. రాకపోవడంతో భర్త మనస్తాపం చెందాడు. లాభం లేదనుకొని తనువు చాలించాలని అనుకొన్నాడు. వెంటనే స్థానికులు చూసి ఎగిసిపడుతోన్న మంటలను ఆర్పి.. పోలీసులకు సమాచారం అందజేశారు. ఒంటిపై తీవ్ర గాయాలు కావడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కలహాల కాపురం

కలహాల కాపురం

భువన్ సూర్య.. సేల్స్ ఎగ్జిక్యూటివ్. భార్య, కూతురు ఉన్నారు. జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గల చింతల్ సుదర్శన్ రెడ్డి నగర్‌లో ఉంటున్నారు. భార్య ఇంటి వద్ద బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కానీ 20 రోజుల క్రితం మాత్రం పీక్‌కి చేరింది. దీంతో అతని భార్య తన అక్క ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి రావాలని పిలిచినా రాలేదు.

రాకపోవడంతో..

రాకపోవడంతో..

భువన్ సూర్య కోపోద్రిక్తుడయ్యాడు. మిత్రుడిని తీసుకెళ్లి మరీ.. భార్యపై చేయిచేసుకున్నాడు. ఇంటికి రానని చెప్పడంతోనే దాడిచేసినట్టు తెలుస్తోంది. అయితే భార్య.. భర్తపై పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. అప్పటినుంచి భార్య, కూతురు... భువన్ సూర్యకు దూరంగానే ఉంటున్నారు. ఇంటికి రావాలని భార్యను వేడుకున్నాడు. కానీ రాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. భార్య తన వద్దకు రాదని నిర్ణయించుకున్నాడు.

పెట్రోల్ పోసుకొని

పెట్రోల్ పోసుకొని

శుక్రవారం తాను ఉంటోన్న ఇంటి వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు బట్టలు కప్పి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే అతనికి 60 శాతం గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందజేయడంతో.. ఘటనాస్థలానికి చేరుకొన్న పోలీసులు అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Recommended Video

COVID-19 Lockdown: Watch Pregnant Woman Walks For 7km, Delivers At Dental Clinic
డబ్బులు లేవు

డబ్బులు లేవు


తన చావుకు ఎవరూ బాధ్యులు కారు అని సూసైడ్ కూడా లభించింది. తన వద్ద దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవు అని పేర్కొనడం కలచివేసింది. భార్య భర్తల మధ్య గొడవే సూసైడ్ అటెంప్ట్‌కు దారితీసింది అని పోలీసులు భావిస్తున్నారు.

English summary
husband bhuvan surya suicide attempt at jeedimetla police station limits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X