హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతను మావోయిస్టులుగా మార్చే కుట్ర: హైదరాబాద్ సీపీ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు సంస్థలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే సంస్థలపై దర్యాప్తు కోసం డిటెక్టివ్ వింగ్‌ సిట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

వరవరరావు, మావోయిస్టు నేత గణపతిపై 1837 పేజీల ఛార్జిషీట్ వరవరరావు, మావోయిస్టు నేత గణపతిపై 1837 పేజీల ఛార్జిషీట్

శుక్రవారం అంజనీకుమార్ మీడియాతో మాట్లాతడుతూ.. నిషేధిత మావోయిస్టు సంస్థలతో కొందరు విద్యార్థులు కలుస్తున్నారని, తుపాకీ పట్టి హింస సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. సీపీఐ మావోయిస్టు సంస్థతోపాటు తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే కుట్ర జరుగుతోందని సీపీ తెలిపారు.

Hyd CP warned frontal organizations of Maoist not to mislead innocent youth to the path of violence

మేధావుల పేరుతో కొంతమంది అమాయకపు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. అలాంటి వారిపై నిఘా పెంచామని, నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు.

తెలంగాణ విద్యార్థి వేదిక ప్రెసిడెంట్ మద్దిలేటి ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో పలు పత్రాలు, మెమోరీ కార్డులు, డీవీడీలు, సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సీపీఐ మావోయిస్టు పార్టీ 50వ వార్షికోత్సవానికి సంబంధించిన కరపత్రాలు కూడా లభించినట్లు తెలిపారు. తెలంగాణ విద్యార్థికకు చెందిన మద్దిలేటితోపాటు అనుదీప్, భరత్, సందీప్, కిశోర్‌లపై వరంగల్, కొత్తగూడెం, గద్వాల్, కాజీపేట ప్రాంతాల్లో పలు కేసులు కూడా నమోదయ్యాయని అంజనీకుమార్ తెలిపారు.

ఆ చట్టాన్ని రద్దు చేయాలంటూ సంఘాల ఆందోళన
ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టాన్ని రద్దు చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో పౌర హక్కుల కోసం పోరాటం చేస్తోన్న మద్దిలేటి, జగన్, నాగరాజు, బలరాం, శిల్ప, నాగన్న తదితరులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని విప్లవ రచయితల సంఘం(విరసం), డీవైఎఫ్ఐ డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోందని, ప్రజా పోరాటం చేసే గొంతులను అణిచివేస్తున్నారని మండిపడ్డాయి.

English summary
Hyderabad Commissioner of Police Anjani Kumar on Friday warned the frontal organisations of Maoists not to mislead innocent youth to the path of violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X