హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భద్రతలో ఎయిర్‌ఫోర్స్ కీలకం: దుండిగల్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దులో ముఖ్యంగా ఈశాన్య లడఖ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణ తర్వాత నుంచి భారత దళాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా అన్నారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యూయేషన్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ సందర్భంగా విమానాల విన్యాసాలు అలరించాయి.

20,500 గంటల ఫ్లయింగ్ శిక్షణను ఈ బ్యాచ్ పూర్తి చేసిందని భదౌరియా తెలిపారు. వైమానిక దళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్ గార్డుగా ఐదుగురు క్యాడెట్లు శిక్షణ పూర్తి చేస్తున్నారని తెలిపారు. వీరిలో బీటెక్ పూర్తి చేసిన 87 మంది ఫ్లయింగ్ అధికారులుగా ఉండటం మంచి పరిణామమని బదౌరియా వ్యాఖ్యానించారు.

 Hyderabad: Air Chief Marshal RKS Bhadauria participated in Combined Graduate passing out Parade.

ఈ సందర్భంగా శిక్షకులకు, ఇతర సిబ్బందికి బదైరియా అభినందనలు తెలిపారు. దేశం కోసం త్యాగం చేయడమే ఫ్లయింగ్ అధికారులు లక్ష్యమని పేర్కొన్నారు. కరోనా వేళ దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాలో వైమానిక దళం కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు.

సరిహద్దులో అదనపు మోహరింపుల పరంగా లేదా భారత్‌తో పాటు చైనా తరఫున ఏదైనా మార్పుల విషయంలో భారత సాయుధ దళాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని భదౌరియా చెప్పారు. తదుపరి రౌండ్ చర్చల కోసం భారత్, చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

"కమాండర్ స్థాయి చర్చల కోసం ఒక ప్రతిపాదన ఉంది. నిర్ణయాలు తీసుకోబడతాయి. మొదటి ప్రయత్నం చర్చలతో కొనసాగడం, మిగితా ఘర్షణ పాయింట్లను తగ్గించడం, దాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది' అని భదౌరియా చెప్పారు.

English summary
Hyderabad: Air Chief Marshal RKS Bhadauria participated in Combined Graduate passing out Parade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X