హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వినమ్రంగా..వినమ్రతతో: ట్రాఫిక్ పోలీసుల ప్రపోజల్స్ : వారం ముందే వచ్చిన లవర్స్ డే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు ప్రేమికుల అవతారం ఎత్తారు. మున్నాభాయ్ ని గుర్తుకు తెస్తున్నారు. ద్విచక్ర వాహనాల మీద వెళ్తున్న వారిని ఆపి, మరీ రోజా పువ్వులను ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తున్నారు. ఈ ఛాన్స్ అందరికీ దక్కేది కాదు. ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే. ట్రాఫిక్ పోలీసులు ఎంపిక చేసుకోవాలంటే.. హెల్మెట్ లేకుండా వెళ్లాలి. హెల్మెట్ లేకుండా బండి బయటికి తీస్తే..జరిమానాలు, చలాన్లు వేస్తూ జేబులను కొల్లగొట్టే ట్రాఫిక్ పోలీసులు గురువారం రోజాపూల దినోత్సవాన్ని నిర్వహించారు.

సింపుల్ గా చెప్పాలంటే- హెల్మెట్ లేకుండా టూ వీలర్ల మీద రాకపోకలు సాగించే వారికి జరిమానాలకు బదులుగా రోజాపూలను చేతిలో పెట్టడం అన్నమాట. వినమ్రంగా, వినమ్రతతో.. తమ రోజువారీ శైలికి దూరంగా దండాలు పెట్టి హెల్మెట్ వినియోగంపై క్లాసులు పీకారు. సికింద్రాబాద్ గోపాలపురం ట్రాఫిక్ పోలీసులది ఈ ఘనత. హెల్మెట్ పెట్టుకోకుండా, హడావుడిగా, అర్జంటుగా ఆఫీస్ కంటూ బయలుదేరిన వాహనదారులకు గోపాలపురం పోలీసుల చేతికి చిక్కారు.

Hyderabad city police makes rose day in the city

జా పూలను చేత్తో పట్టుకుని, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ట్రాఫిక్ పోలీసులు తమకు కంటపడ్డ వారిని కంటపడినట్టే పట్టేసుకున్నారు. బైక్ ను పక్కన ఆపేసి, హెల్మెట్ వినియోగంపై ఉపన్యాసం మొదలు పెట్టారు. అది ముగిసే సరికి వాహనదారుల తల బొప్పి కట్టి ఉంటుంది. తల ప్రాణం తోకకు వచ్చినట్టనిపించి ఉంటుంది. విశేషమేమిటంటే- బైక్ మీద యువతీ, యువకులు గనక ఉంటే వారి నేపథ్యాన్ని ఆరా తీయడం. ఒకరికొకరు ఏమవుతారు? ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటంటూ గుచ్చి, గుచ్చి ప్రశ్నించారు.

వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించడానికి గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు సీజన్ కు తగినట్టుగా ప్రవర్తించడం ఇక్కడ ట్విస్ట్. ఇది ఫిబ్రవరి కాబట్టి, లవర్స్ డే సీజన్. ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం. ప్రేమికుల మధ్య అనుబంధానికి గుర్తు రోజా. దీనికి అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు రోజా పూల దినోత్సవాన్ని చేపట్టారు. వారి ప్రవర్తనను చూసి, లవర్స్ డే వారం రోజులు ముందే వచ్చినట్టుందని గొణుక్కుంటూ వెళ్లిపోయారు వాహనదారులు.

English summary
Gopalapuram Traffic Police makes Rose day in their PS limits. Traffic Police were observed Gandhigiri in Secunderabad area. They stopped biker and two wheeler handover Roses to them. They elaborately explained utilization of Helmet when the driving. Bikers also respond positively and took Rose from Traffic Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X