హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనం మనసు గెలిచిన హైదరాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్... అంబులెన్సుకు దారివ్వడం కోసం ఇలా...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌కి చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ జనం మనసులు గెలుచుకున్నాడు. ఓ అంబులెన్సుకు దారివ్వడం కోసం రోడ్డుపై వాహనాలను క్లియర్ చేస్తూ దాదాపు 2 కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు. వాహనదారులకు సూచనలు చేస్తూ... వాహనాలను పక్కకు తప్పిస్తూ అంబులెన్సు కు లైన్ క్లియర్ చేశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఆ కానిస్టేబుల్ పడ్డ తపన ప్రతీ ఒక్కరినీ కదిలించేలా ఉంది. హైదరాబాద్‌లోని మొజంజాహి మార్కెట్‌ నుంచి కోఠి వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే... నిత్యం రద్దీగా ఉండే మొజంజాహి-కోఠి మార్గంలో అబిడ్స్ జీపీవో జంక్షన్ వద్ద ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అందులో ఉన్న వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ జి.బాబ్జీ.. తానే రంగంలోకి దిగాడు. రోడ్డుపై వాహనాలను పక్కకు తప్పిస్తూ అంబులెన్సుకు లైన్ క్లియర్ చేశాడు. అలా 2కి.మీ వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. నిజానికి బాబ్జీ విధులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌ పరిధికే పరిమితమైనప్పటికీ... అబిడ్స్ దాటిన తర్వాత కూడా అంబులెన్సుకు లైన్ క్లియర్ చేస్తూ ముందుకు సాగాడు. అలా మొజాం జాహీ మార్కెట్ నుంచి జీపీఓ, ట్రూప్ బజార్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధి వరకు అంబులెన్సు ముందు పరిగెత్తుతూనే ఉన్నాడు.

 Hyderabad cop runs 2 km to clear traffic jam and make way for ambulance

కానిస్టేబుల్ నిబద్దతతో అంబులెన్సు సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో... అందులో ఉన్న పేషెంట్‌కు ప్రాణపాయం తప్పింది. అంబులెన్సులో ఉన్న వ్యక్తే... కానిస్టేబుల్ రోడ్డుపై పరిగెత్తుతుండగా వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. హైదరాబాద్ పోలీసులు కూడా ఆ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. 'ప్రతీ అడుగు ప్రజల కోసం... మీ భద్రతే మాకు ముఖ్యం' అని ఆ వీడియోకి కామెంట్‌ని జతచేశారు. వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

బాబ్జీ నిబద్దతకు మెచ్చి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆయన్ను సన్మానించడం విశేషం. ఈ సందర్భంగా బాబ్జీని ఆయన అభినందించి జ్ఞాపికను అందజేశారు.

English summary
A traffic policeman in Hyderabad is being lauded for running two kilometres to clear a traffic jam for an ambulance. Traffic constable G Babji ran two kilometres to help an unknown patient being taken to the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X